Online Betting Apps: చిన్న, పెద్ద తేడా లేకుండా బెట్టింగ్ భూతం ప్రతి ఒక్కరిని ఆవహిస్తోంది. ఎన్నో కుటుంబాలను చిధ్రం చేస్తుంది. బంధుత్వాలను మరిచి ఉసురు తీస్తోంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. బెట్టింగ్ మాయలో పడి కన్న తల్లి, తండ్రి అనే భావన లేదు. బెట్టింగ్ మత్తులో కొందరు దారుణ హత్యలు చేస్తున్నారు.
ఇటీవల ఓ నిండు ప్రాణాన్ని కర్కశంగా బలితీసుకోంది బెట్టింగ్ దెయ్యం.హైదరాబాద్ గచ్చిబలౌ కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి, డబ్బు ఖర్చు చేయడంతో… ఆడొద్దని మందలించిన తండ్రి హనుమంతు నాయక్‌ను దారుణంగా కడతేర్చాడు కొడకు రవీందర్ నాయక్.
వనపర్తి జిల్లాకు చెందిన హనుమంత్ నాయక్ కుటుంబంతో కలిసి… హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. కొడుకు రవీందర్ చదువు కోసం పొలాన్ని తాకట్టు పెట్టాగా… వచ్చిన 6 లక్షల రూపాయలను రవీందర్‌కు ఇచ్చాడు. బెట్టింగ్‌కు అలవాటు పడిన రవీందర్ ఆ డబ్బు మొత్తాన్ని బెట్టింగ్‌లో ఖర్చు చేశాడు. అప్పటికే ఆ డబ్బుల గురించి తండ్రి హనుమంత్ నాయక్ నిలదీశాడు. రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల్లో తిరిగి ఇస్తాడని చెప్పి కాలయాపన చేస్తున్నాడు. ఇదే విషయంపై తండ్రీ కొడుకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన ఫ్రెండ్ డబ్బులు తిరిగి ఇస్తున్నాడని నమ్మించి… తండ్రిని నిర్మానుష్య ప్రదేశానికి కొడుకు రవీంద్ర నాయక్ తీసుకెళ్లాడు.
Also Read: ఖర్గే హైదరాబాద్ టూర్.. కాంగ్రెస్‌లో టెన్షన్
బాహ్య ప్రదేశంలో తండ్రి గొంతులో కత్తితో పొడిచి రవీందర్ నాయక్ హత్య చేశాడు. అనంతరం తన బావ రమేశ్ నాయక్‌కు ఫోన్ చేసి నాన్న పొడుచుకుని చనిపోయాడు అని చెప్పాడు. అక్కడకు వెళ్లిన కుటుంబసభ్యులకు అనుమానాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీసులు రావడంతో అసలు విషయం బయటపడింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.