Tirupati Crime News: సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. విచ్చల విడిగా వాడేస్తున్నారు సామాన్యులు. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలని కొందరు తపనతో బానిస అవుతున్నారు. ఫలితంగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాతో లవ్‌లో పడింది ఓ వివాహిత. భర్త, పిల్లలు వద్దని భావించింది. కోరుకున్న ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడు సైతం సూసైడ్ చేసుకున్న ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?
విశాఖపట్నానికి చెందిన పద్మకు దాదాపు 35 ఏళ్లు ఉంటాయి. ఆమెకు ఇదివరకు పెళ్లి అయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలో ఓ యువకుడితో రిలేషన్ పిప్ కుదిరింది. ఆపై ప్రేమకు దారితీసింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు.
ఆ యువకుడి పేరు సురేష్, వయస్సు 30 ఏళ్లు. శ్రీకాళహస్తిలో మొబైల్ షాపులో పని చేస్తుంటాడు. ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలేసింది పద్మ. కోరుకున్న ప్రియుడ్ని సురేష్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే చేసింది కూడా. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది. తొమ్మిది నెలలుగా పద్మ-సురేష్ కాపురం హాయిగా సాగింది.
ఒక్కసారిగా ఈ దంపతుల మధ్య చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి. రోజు రోజుకూ విభేదాలు పెరుగుతున్నాయో తప్ప బ్రేక్ పడడం లేదు. మూడు రోజుల కిందట మరోసారి ఈ దంపతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా టిఫిన్, భోజనం వృథా చేస్తోందని కోరుకున్న భార్య పద్మను మందలించాడు సురేశ్. దీన్ని అవమానంగా భావించింది పద్మ.
ALSO READ: మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం.. జైలు సెక్యూరిటీ గార్డులు రాక్షసంగా ఆమెని
తనపై భర్తకు ప్రేమ లేదని భావించింది. పెళ్లి చేసుకున్న భర్త, పిల్లలు వదిలేసింది. ప్రియుడు చీటికి మాటికీ గొడవ పడటాన్ని సీరియస్‌గా తీసుకుంది. అయినవాళ్లు కాదనప్పుడు తనకు ఈ జీవితం ఎందుకని భావించి ఈనెల 22న ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించాడు సురేష్.
చివరకు మనస్తాపానికి గురైన సురేష్, శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. సురేష్ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న సురేష్‌ను హుటాహుటిన శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి సురేష్ మృతి చెందాడు. పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలో ఉంది. ఈ ఘటనపై విశాఖలోని ఆమె బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఉన్నట్లుండి ఇద్దరు రోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు. దీనివెనుక కారణాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు.