Preity Zinta : ఐపీఎల్ 2025 సీజన్ లో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విధితమే. ఎప్పుడూ ఏ జట్టు విజయం సాధిస్తుందో.. ఎప్పుడూ ఏ జట్లు ఓటమి పాలవుతుందో ఊహించడం చాలా కష్టంగానే మారింది. ఈ జట్టు కచ్చితంగా గెలుస్తుందనుకున్న సమయంలోనే.. ఆ జట్టు ఓడిపోతుంది. ఆ జట్టు ఓడిపోతుందనుకున్న సమయంలో మరో జట్టు గెలిచి అందరనీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి చేరుకున్నాయి. అయితే ప్లే ఆప్స్ కి చేరుకున్న జట్లకు ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించిన జట్లు షాక్ ఇస్తున్నాయి. తొలి స్థానంలో ఇప్పటివరకు ఏ జట్టు ఉంటుందనేది తేలడం లేదు.
Also Read : Race to Top 2 : RCB కి బంపర్ ఆఫర్.. ప్లే ఆఫ్స్ లో ఇలా జరిగితే కప్ గ్యారంటీ
మొన్న గుజరాత్ టైటాన్స్ (GT) జట్టును లక్నో ఓడించగా.. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ని సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH).. పంజాబ్ కింగ్స్(pbks) జట్టును ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఏ జట్లు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ బౌండరీ లైన్ అవుతలికి సిక్స్ బాదాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కరణ్ నాయర్ ఆ బంతిని గాలిలో క్యాచ్ అందుకున్నాడు. కానీ క్యాచ్ పట్టినప్పటికీ బంతి చేతిలోంచి జారింది. దీంతో అతను బ్యాలెన్స్ ఆపలేక సిక్స్ లైన్ అవతలకి వెళ్లాడు. ఈ బంతిని సిక్స్ అని సింబల్ చూపించాడు కరుణ్ నాయర్. కానీ వాస్తవానికి ఆ బాల్ సిక్స్ కాదు. రిప్లె లో సిక్స్ కాదని తేలింది. అది సిక్స్ కాకపోయినా అతను లైన్ అవతలికి పోవడంతో సిక్స్ అనుకొని సిక్స్ అని చెప్పాడు కరుణ్. దీంతో అతని పై ప్రశంసల వర్సం కురిపిస్తున్నారు. గొప్ప మనస్సు వ్యక్తి కరుణ్ నాయర్ అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.
ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో థర్డ్ అంఫైర్ నిర్ణయం పై పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో శశాంక్ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద కరుణ్ నాయర్ పట్టుకొని లోపలికి విసిరాడు. తన కాలు రోప్ ను తగిలిందంటూ సిక్సర్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో థర్డ్ ఎంఫైర్ దానిని సిక్స్ కాదన్నారు. దీనిపై ప్రీతి స్పందిస్తూ.. ఎంతో టెక్నాలజీ ఉన్న హై ప్రొఫైల్ టోర్నమెంట్ లో ఇలాంటి తప్పులు సరికాదు అన్నారు ప్రీతి జింటా. ప్రస్తుతం ప్రీతి జింటా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
In a such a high profile tournament with so much technology at the Third Umpire’s disposal such mistakes are unacceptable & simply shouldn’t happen. I spoke To Karun after the game & he confirmed it was DEFINITELY a 6 ! I rest my case ! #PBKSvsDC #IPL2025 https://t.co/o35yCueuNP
— Preity G Zinta (@realpreityzinta) May 24, 2025