BigTV English

Prison Guards: మతిస్థిమితం లేని యువతిపై.. జైలు సెక్యూరిటీ గార్డులు అఘాయిత్యం

Prison Guards: మతిస్థిమితం లేని యువతిపై.. జైలు సెక్యూరిటీ గార్డులు అఘాయిత్యం

Prison Guards Gang Rape| రక్షకులే భక్షకులుగా మారారు. అనాథగా వీధిలో తిరుగుతున్న ఒక యువతిపై భద్రతా సిబ్బందిగా ఉద్యోగం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని శ్రీ భూమి జిల్లాలోని జైలులో బ్రజేన్ (45), హరేశ్వర్ కాలిటా (50) అనే ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేస్తున్నారు. అయితే వారిద్దరూ జైలు సమీపంలోని ఉద్యోగుల క్వార్టర్స్ లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మే 24 2025 రాత్రి 1.30 గంటలకు (శుక్రవారం అర్ధరాత్రి) వారిద్దరూ క్వార్టర్స్ సమీపంలో ఒక యువతి ఒంటరిగా ఉండడం చూశారు. అయితే ఆమెకు మతిస్థిమితం సరిగా లేని కారణంగా. అందుకే ఆమెను మాయమటలు చెప్పి తమ క్వార్టర్స్‌కు తీసుకెళ్లారు.

అక్కడ ఆమెపై ఇద్దరూ సామూహికంగా దారుణానికి ఒడిగట్టారు. ఆ తరువాత ఆమె కేకలు వేస్తుండగా.. అక్కడ నివసిస్తున్న ఇతర జైలు సిబ్బంది. ఈ గమనించి షాకయ్యారు. వెంటనే వారిద్దరి నుంచి ఆ యువతి కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేసి.. తదుపరి విచారణ కొనసాగిస్తామని శ్రీ భూమి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ జ్యోతి తెలిపారు.


17 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసిన స్వామిజీ

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రామ మందిరానికి చెందిన సన్యాసి ఒకరు 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు లోకేశ్వర మహారాజ్. ఇతను బెలగావి జిల్లా రాయ్‌బాగ్ తాలూకాలోని మేఖలి గ్రామంలో రామ మందిరంలో స్వామీజీ‌గా అందరికీ తెలుసు. ఈ గ్రామం రాష్ట్ర రాజధాని బెంగళూరు నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వర మహారాజ్ ఆ బాలికను మోసం చేసి, బాగల్‌కోట్ నగరంలోని ఒక లాడ్జ్‌కు తీసుకెళ్లి అక్కడ అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత ఆమెను రాయ్‌చూర్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా లైంగికంగా వేధించాడు. ఈ దారుణం తర్వాత, ఆ బాలికను బాగల్‌కోట్ జిల్లాలోని మహాలింగపూర్ బస్టాండ్ వద్ద వదిలేశాడు.

బెలగావి జిల్లా ఎస్పీ డాక్టర్ భీమశంకర్ ఎస్. గులేద్ మాట్లాడుతూ.. “నిందితుడు లోకేశ్వర ఆ బాలికను తన కారులో ఇంటి వరకూ లిఫ్ట్ ఇస్తానని చెప్పి మోసం చేశాడు. తన కారులో కిడ్నాప్ చేసి.. ఆమెను రాయ్‌చూర్, బాగల్‌కోట్‌లలోని లాడ్జ్‌లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత బెలగావి శివార్లలో వదిలేశాడు” అని తెలిపారు.

ఈ ఘటనపై బాగల్‌కోట్‌లోని నవనగర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు బాగల్‌కోట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. “బాధితురాలిని బాగల్ కోట్ జిల్లా నుంచి తీసుకెళ్లారు కాబట్టి ఇక్కడ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నాం” అని ఎస్పీ గులేద్ చెప్పారు. ఆ తర్వాత ఈ కేసును బెలగావి జిల్లాలోని మూడలగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×