BigTV English

Assam minor gang-rape: పోలీసులు నుంచి తప్పించుకొని పారిపోయిన రేప్ కేసు నిందితుడు.. చెరువులో పడి మృతి!

Assam minor gang-rape: పోలీసులు నుంచి తప్పించుకొని పారిపోయిన రేప్ కేసు నిందితుడు.. చెరువులో పడి మృతి!

Assam minor gang-rape: అస్సాంలో ఒక బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. అయితే వారిద్దరినీ శనివారం ఉదయం ఘటనా స్థలానికి తీసుకెళ్తే.. అక్కడ నుంచి నిందితుడు పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని పారిపోయాడు. అయితే ఈ క్రమంలో చెరువులో పడి మరణించాడు.


వివరాల్లోకి వెళితే.. అస్సాం లోని నగావ్ జిల్లా లోని ఢింగ్ ప్రాంతంలో ఒక 14 ఏళ్ల బాలిక పై గురువారం ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ బాలిక రాత్రి 8 గంటలకు ట్యూషన్ నుంచి ఇంటికి సైకిల్ పై వస్తుండగా.. చెరువుగట్టు వద్ద ఉన్న ముగ్గరు నిందితులు ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఆ బాలిక చెరువు పక్కన గాయాలతో పడి ఉండడం చూసి స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు.

అయితే బాలికపై సామూహిక అత్యాచారంపై స్థానికులు రోడ్లపై నిరసనలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక పై సామూహిక అత్యాచారం కేసులో విచారణ మొదలు పెట్టిన పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేశారు. మూడో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ క్రమంలో పోలీసులు ఇద్దరు నిందితులను శనివారం ఉదయం ఘటనా స్థలానికి క్రైమ్ సీన్ తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో నిందితులకు వివరించమని అడిగారు. అయితే అదుపులో ఉన్న ఇద్దరు నిందితులలో తఫజుల్ ఇస్తాం అనే నిందితుడు పోలీసుల కనుగప్పి పారిపోయాడు. ఇది గమనించిన పోలీసులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు తన వెంట పడుతుండడం చూసి నిందితుడు చెరువులో దూకేశాడు.

ఆ తరువాత చాలా సేపు వరకు ఎటు మాయమైపోయాడు ఎవరికీ కనపడలేదు. చాలాసేపు చెరువులో ఈతగాళ్ల చేత గాలించాక… నిందితుడి శవం దొరికింది.

Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!

నగావ్ జిల్లి ఎస్ పీ స్వప్నీల్ డేకా మాట్లాడుతూ.. ”ఒక పోలీస్ టీమ్ శనివారం తెల్లవారు జామున క్రమ్ సీన్ కి నిందితులను తీసుకెళ్లింది. అయితే ఇద్దరిలో ఒకరు తఫజుల్ ఇస్లాం పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని పాయిపోతూ చెరువులోకి దూకాడు. అయితే పోలీసులు, SDRF టీమ్ ఈతగాళ్లతో కలిసి చెరువులో అతని కోసం చాలాసేపు గాలించారు.. చివరికి అతని శవం దొరికింది.” అని తెలిపారు.

ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను ఒక్కటే చెప్పదలచుకున్నాను. మహిళలపై అత్యాచార ఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటుందని గమనించాలి. అత్యాచార ఘటనల్లో పోలీసులు, ప్రభుత్వం ఆలస్యం చేస్తే.. ప్రజలు సహంచరు. అత్యాచార ఘటనలపై చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వం అలా చేయలేదు. అందుకే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఒక సామాజిక వర్గానికి చెందిన వారు క్రిమినల్స్ గా మారుతున్నారు. ముగ్గురు నిందితులో ఒకరు హిందువు అని నాకు తెలిసింది. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.” అని చెప్పారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×