BigTV English
Advertisement

Telangana Liquor Shops: మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం

Telangana Liquor Shops: మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం

Telangana Liquor Shops: మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు మొత్తం 95,137 దరఖాస్తులు నమోదు అయ్యాయి. ఈ దరఖాస్తుల నుంచి లైసన్స్‌ల ఎంపిక కోసం డ్రా పద్ధతిని అనుసరించనున్నారు. అక్టోబర్ 27 (సోమవారం) ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఈ డ్రా ప్రక్రియ ప్రారంభం కానుంది. హైకోర్టు నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో, ఎలాంటి అసౌకర్యం లేకుండా డ్రా నిర్వహించాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


హైకోర్టు ఆదేశాల మేరకు, ఎటువంటి ఆలస్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో డ్రా పూర్తి చేయాలి అని కమిషనర్ హరికిరణ్ స్పష్టం చేశారు.

తెలంగాణలోని 33 జిల్లాల్లో మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆసక్తికరంగా ఉంది.


అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు , కోమురమ్‌ భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680, మంచిర్యాలలో 73 షాపులకు 1712, నిర్మల్‌లో 47 షాపులకు 3002, హైదరాబాదులో 82 షాపులకు 3201, సికింద్రాబాద్లో 97 షాపులకు 3022, జగిత్యాలలో 71 షాపులకు 1966, కరీంనగర్‌లో 94 షాపులకు 2730, పెద్దపల్లి 77 షాపులకు 1507, రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1381, ఖమ్మంలో 122 షాపులకు 4430, కొత్తగూడెం 88 షాపులకు 3922, జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774, మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2487, నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1518, వనపర్తిలో 37 షాపులకు 757, మెదక్‌లో 49 షాపులకు 1920, సంగారెడ్డి 101 షాపులకు 4432, సిద్దిపేట్‌ లో 93 షాపులకు 2782, నల్లగొండ 155 షాపులకు 4906, సూర్యపేట్‌లో 99 షాపులకు 2771, యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2776, కామారెడ్డి 49 షాపులకు 1502, నిజామాబాద్‌ 102 షాపులకు 2786, మల్కాజిగిరిలో 88 షాపులకు 5168, మేడ్చల్‌లో 114 షాపులకు 6063, సరూర్‌నగర్‌లో 134 షాపులకు 7845, శంషాబాద్‌లో 100 షాపులకు 8536 వికారాబాద్‌ 59 షాపులకు 1808, జనగామాలో 47 షాపులకు 1697, భూపాలపల్లి 60 షాపులకు 1863, మహాబూబబాద్‌లో 59 షాపులకు 1800, వరంగల్‌ రూరల్‌లో 63షాపులకు 1958, వరంగల్‌ అర్బన్‌లో 65 షాపులకు 3175 దరఖాస్తులు వచ్చాయి.

గతంలో మద్యం షాపుల డ్రా ప్రక్రియపై హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. దీంతో డ్రా ఆలస్యమైంది. అయితే అక్టోబర్ 25న హైకోర్టు ఆమోదం ఇవ్వడంతో ఎక్సైజ్ శాఖ వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, ఎటువంటి లోపం లేకుండా డ్రా నిర్వహిస్తాం” అని అధికారులు హామీ ఇచ్చారు.

Related News

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

MP Chamala Kiran Kumar Reddy: నవంబర్ 11న ఎవరి చెంప చెల్లుమంటుందో తెలుస్తుంది.. హరీశ్ రావుకు ఎంపీ చామల కౌంటర్

Jubilee Hills Bypoll Elections: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు.. రేవంత్ ప్రచార భేరీ..!

Mahesh Kumar Goud: కొండా సుస్మిత వ్యాఖ్యలు.. పార్టీ నేతలకు మహేశ్ కుమార్ హెచ్చరిక

Sajjanar On Bus Accident: మన చుట్టూ టెర్రరిస్టులు, మానవ బాంబులు.. సీపీ సజ్జనార్ సంచలన పోస్ట్

Kalvakuntla Kavitha: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. కవిత కొత్త రూట్!

Khammam News: విదేశీ అల్లుడి బాగోతం.. పెళ్లైన వారానికే భార్యకు నరకం, అసలు మేటరేంటి?

Big Stories

×