BigTV English

Crime News: నార్సింగి పీఎస్‌ పరిధిలో.. ఇంజనీర్ దారుణ హత్య

Crime News: నార్సింగి పీఎస్‌ పరిధిలో.. ఇంజనీర్ దారుణ హత్య

An Engineer was Brutally Murdered in Narsingi Police Station: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారంనాడు పట్టపగలే దారుణ హత్య జరిగింది. మంచిరేవులలోని ఓ వెంచర్ ఓపెన్ ప్లాట్ లో.. గోల్కొండకు చెందిన ఇజాయత్ అలీ అనే ఇంజినీర్ ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. క్వాలీస్ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతడిని గొంతు కోసి చంపేశారు.


కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ యువతి ఉన్నట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు.. ఇజాయత్ కాళ్లు పట్టుకోగా.. ఒకరు గొంతు కోసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం క్వాలిస్‌ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు.

Also Read: దారుణం.. ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని చంపిన ఇంటర్ విద్యార్థి


ఇజాయత్ అలీ దుబాయ్ లో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. 20 రోజుల క్రితం ఆయన ఇండియా వచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి నార్సింగి పోలీసులు, క్లూస్ టీం చేరుకుని.. కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆవ్యక్తిని ఎందుకు హత్యచేయాల్సి వచ్చింది. ఈ ప్రదేశానికి ఏమని చెప్పి ఆ వ్యక్తిని తీసుకొచ్చోరు? హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×