BigTV English

Murder: దారుణం.. ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని చంపిన ఇంటర్ విద్యార్థి

Murder: దారుణం.. ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని చంపిన ఇంటర్ విద్యార్థి

Murder by Inter Students: కూకట్‌పల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని ఎనిమిది మంది మిత్రులతో కలిసి ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేశాడు. చంపిన అనంతరం రైలు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుడు.. ఆ మృతదేహాన్ని రైలు పట్టాలపైకి తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.


ఓ అమ్మాయి కోసం ఇంటర్ విద్యార్థులు గత కొంతకాలంగా కొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని అల్లాపూర్ ప్రాంతంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించొద్దని 17 ఏళ్ల మైనర్ డానిష్ ని ఎనిమిది మంది స్నేహితులతో కలిసి ఇంటర్ విద్యార్థి చంపేశాడు.

ఈనెల 22న రాత్రి 9.30 నిమిషాలకు డానిష్ కు ఓ స్నేహితుడు ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిచాడు. అనంతరం పది మంది కలిసి ఓ వైన్ షాపులో మద్యం తాగారు. ఈ సమయంలో అమ్మాయి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ తర్వాత అమ్మాయి విషయంలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలోనే కోపంతో తొమ్మిది మంది డానిష్‌పై దాడి చేశారు.


డానిష్ ను బీరుసీసాతో అందులో ఉన్న ఓ రౌడీషీటర్ కుమారుడు కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి నిందితులు వెళ్లిపోయారు. అయితే తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని డానీష్ పై రౌడీ షీటర్ కుమారుడు పగ పెంచుకున్నట్లు తేలింది. నిందితుడు యూసఫ్ గూడలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లు సమాచారం.

కాగా, ఈ నెల 23న మూసాపేట వద్ద రైలు పట్టాలపై డానీష్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే డానీష్ ఆత్మహత్య కాదని..ఆత్మహత్య చేసుకునంత పిరికివాడు కాదని, తన కుమారుడిని ఎవరో హత్య చేశారని మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: సైనిక విన్యాసాలలో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. డానీష్ సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. స్థానిక రౌడీషీటర్ కుమారుడు ఫోన్ చేసినట్లు విచారణలో తేలింది. చివరికి డానీష్ ను చంపింది స్నేహితులేనని వెల్లడైంది.

 

 

 

 

Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×