BigTV English

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Student Suspicious death in Bhopal: భోపాల్ ఎన్ఐటీ కళాశాలలో ఎంటెక్ విద్యార్థి శశిధర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. తోటి విద్యార్థులే హత్య చేసి, ఆత్మహత్య అంటున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామ నివాసి శశిధర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎన్ఐటి కళాశాలలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే, సెప్టెంబర్ రెండవ తేదీన విద్యార్థి తన రూమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల యాజమాన్యం బంధువులకి తెలియజేసింది. దీంతో వెంటనే బంధువులు భోపాల్ కళాశాల వద్దకు వెళ్లి తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదని, అతని స్నేహితులు, మరి కొందరు కలిసి హత్య చేసి, ఆత్మహత్యగా సృష్టించారంటూ ఆరోపించారు.


Also Read: ఎవరైనా సరే.. ఎమ్మెల్యే లకు చంద్రబాబు వార్నింగ్

కాగా, పలువురు వ్యక్తులు శశిధర్ ను నిత్యం వేధించే వారని.. కాలేజీలో డ్రగ్స్ సరఫరా ఉందని, శశిధర్ కు డ్రగ్స్ అలవాటు చేసేందుకు వారు ప్రయత్నించడంతో శశిధర్ ససేమిరా అంటున్నందుకు అతడిపై కక్ష పెట్టుకుని హత్య చేశారని, మృతదేహం మెడపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అంటూ, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగినదని వారిపై కూడా చర్యలు తీసుకుని, మాకు న్యాయం చేయాలని శశిధర్ బంధువులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహానికి స్వగ్రామమైన ఊళ్ళపాలెం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


Also Read: జగన్ ఫారెన్ టూర్ ఆలస్యం.. పాస్‌పోర్టు కష్టాలు, వెనుక ఏదో..

భోపాల్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. దీనిపై పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది.

Related News

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల మందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Big Stories

×