Jagan foreign tour delay: అనుకున్నదొక్కటి.. ఐనదొక్కటి.. ఇదీ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ వ్యవహారం. తాను ఒకటి తలిస్తే.. దైవమొకటి తలచింది. ఫారెన్ టూర్‌కి న్యాయస్థానం అనుమతి తెచ్చుకున్న ఆయనకు.. అనుకోని చిక్కులు ఎదురయ్యాయి. నాలుగున యూకెకి వెళ్లాల్సిన ఆయన, కొద్దిరోజులపాటు వాయిదా పడింది. అసలేం జరుగుతోంది?
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు మాజీ సీఎం జగన్. ఆయన ఫారెన్ టూర్ వెళ్లాలంటే కచ్చితంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. యూకె వెళ్తున్నానని తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ రెండువారాల కిందట సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
ALSO READ: వైసీపీకి బాలినేని గుడ్ బై.? ఆ పార్టీలోకి జంప్..?
సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు విదేశాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. అనుకోని పరిస్థితి ఆయన పర్యటన వాయిదా పడింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. విజయవాడ వరదల నేపథ్యంలో జగన్ తన పర్యటనను వాయిదా వేస్తుంటారని నేతలు, అభిమానులు, చివరకు ప్రజలు భావించారు.
జగన్ విదేశీ పర్యటనకు కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు పాస్ట్‌పోర్టు చిక్కులు ఎదురయ్యాయి. గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉండడంతో డిప్లొమాట్ పాస్‌పోర్ట్ వచ్చింది. అధికారం పోవడంతో ఆ పాస్ పోర్టు రద్దయ్యింది. చేసేదేమీ లేక జనరల్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు ఐదేళ్లు జనరల్ పాస్ పోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సీబీఐ కోర్టు చెప్పిన విషయం తెల్సిందే.
విజయవాడ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం కేవలం ఏడాది పాస్ పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తనకు ఐదేళ్ల పాస్ పోర్టు ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. దీంతో లండన్ ప్రయాణం వాయిదా పడింది.
గడిచిన పదేళ్లగా జగన్ విదేశాలకు వెళ్లిన ప్రతీసారీ ఇలాంటివన్నీ చెక్ చేసుకుని మరీ వెళ్లేవారు. ఈ విధంగా ఎప్పుడు జగన్ టూర్ వాయిదా పడిన సందర్భం లేదు. టూర్ వాయిదా వెనుక ఏదో జరుగు తోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ఏమో రేపటి రోజున ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.