E-Paper
Advertisement

Bengaluru Crime: బెంగుళూరులో దారుణం.. బీబీఏ విద్యార్థిని దారుణహత్య, ఆమె సొంతూరు ఏపీ

Bengaluru Crime: బెంగుళూరులో దారుణం.. బీబీఏ విద్యార్థిని దారుణహత్య, ఆమె సొంతూరు ఏపీ
Advertisement

Bengaluru Crime: కారణాలు ఏమైనా కావచ్చు. బెంగుళూరులో బీబీఏ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. ప్రియుడే యువతికి ఊపిరి ఆరకుండా చేసి హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.  యువతి ఆంధ్రప్రదేశ్‌కి చెందినది . దీంతో ఏదో జరిగిందోనన్న అనుమానాలు మొదలయ్యాయి. అసలు యువతి విషయంలో ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

బెంగుళూరులో యువతి దారుణహత్య

Advertisement

బెంగళూరులో చదువుతున్న 21 ఏళ్ల బీబీఏ విద్యార్థిని ఆదివారం హత్యకు గురైంది. బాధితురాలు దేవిశ్రీగా గుర్తించారు. ఆచార్య కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-BBM చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె మృతికి ప్రియుడు కాణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బిక్కింవారిపల్లె ప్రాంతానికి చెందినది దేవశ్రీ. రెడ్డెప్ప-జగదాంబ దంపతుల గారాలపట్టి దేవశ్రీ. బెంగుళూరులోని ఆచార్య కాలేజీలో బీబీఏ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని అద్దెకు ఉంటోంది దేవశ్రీ. ఆమె ఫ్రెండ్ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దకొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్‌. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు.

Advertisement

ప్రియుడే యముడు.. మృతురాలు ఏపీకి వాసి

దేవిశ్రీ స్నేహితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయంత్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఆమె రూమ్‌కి వెళ్లాడు. డోర్ బయట లాక్ చేసి వుంది. కిటికీలో నుంచి చూడగా విగత జీవిగా దేవిశ్రీ పడి ఉంది. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అతడు మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు మాత్రం ప్రేమ్ వర్ధన్.. దేవిశ్రీని గొంతు కోసి లేదా ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రేమ్-దేవిశ్రీ ఆదివారం ఉదయం 9. 30 గంటల సమయంలో గదికి వచ్చారు. రాత్రి 8.30 గంటల వరకు అక్కడే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఏమైనా జరిగి ఉండవచ్చని అంటున్నారు. ఆ తర్వాత అతడు గదికి తాళం వేసి పారిపోయినట్టు తెలుస్తోంది.

ALSO READ: రైలు ఎక్కుతుండగా మహిళను అక్కడ పట్టుకున్న ఆకతాయి

ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో గాలింపు మొదలుపెట్టారు.  కూతురు హత్య విషయం తెలియగానే తల్లిదండ్రులు షాకయ్యారు. చదువు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాతో ఇంటికి వస్తుందని భావించామని, అంతలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కావడం లేదు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×