BigTV English

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ మిస్టరీలు, థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇందులో ఉండే ప్రతి క్లూ, ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సిటీలో వరుస హత్యలు, కొడుకు రీఎంట్రీతో ఫ్యామిలీ అంతా అల్లకల్లోలం అయ్యే ఒక సైకో అంశాలతో కూడిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఊహించని మలుపులతో మిమ్మల్ని చివరి వరకు కట్టిపడేస్తుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? అనే వివరాల్లోకి వెళదాం.


సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు Family Drama. 2021లో రిలీజ్ అయినా ఈ మూవీ SonyLIVలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. సినిమా నిడివి 2 గంటల 4 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ మూవీ తెలుగు భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో సుహాస్ (రామ), తేజ కసరపు (లక్ష్మణ్), పూజ కిరణ్ (యమిని), అనుష నూతుల (మహతి), శ్రుతి మెహర్ (పార్వతి), సంజయ్ రాత (సదాశివ రావు) తదితరులు నటించారు. అజయ్ బ్రహ్మందం, సంజయ్ బ్రహ్మందం దీనికి సంగీతం అందించారు. అయితే సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలు, వయోలెన్స్ కారణంగా ఈ మూవీ పెద్దలకు మాత్రమే.

స్టోరీలోకి వెళ్తే…
కథ సదాశివ రావు (సంజయ్ రాత) అనే కఠినమైన, దుర్మార్గపు తండ్రి చుట్టూ తిరుగుతుంది. అతను తన భార్య పార్వతి (శ్రుతి మెహర్), చిన్న కొడుకు లక్ష్మణ్ (తేజ కసరపు), కోడలు యామిని (పూజ కిరణ్)లను శారీరకంగా, మానసికంగా హింసిస్తాడు. సదాశివ రావు తన పెద్ద కొడుకు రామ (సుహాస్)ను ఉద్యోగం లేనందుకు ఇంటి నుండి గెంటివేస్తాడు. దీంతో రామ కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి. దీంతో రామ, ఒక సైకోపాత్, సీరియల్ కిల్లర్‌గా మారతాడు. సిటీలో వరుస హత్యలు చేస్తూ టెర్రర్ పుట్టిస్తాడు. గొంతు కోసి, నేరం జరిగిన స్థలంలో రక్తం మాత్రమే ఉండేలా చేయడం రామ కిల్లింగ్ స్టైల్.


లక్ష్మణ్ తన తండ్రి హింసను భరించలేక, రామతో మళ్లీ మాట్లాడతాడు. ఇద్దరూ కలిసి సదాశివ రావును కాఫీలో విషం కలిపి పక్షవాతానికి గురిచేయాలని కుట్ర పన్నుతారు. దీనివల్ల వారసత్వం వారికి దక్కుతుందని భావిస్తారు. పార్వతి కూడా భర్త హింస నుండి విముక్తి కోసం, ఈ ప్లాన్‌లో చేరుతుంది. ప్లాన్ విజయవంతమవుతుంది, సదాశివ రావు పక్షవాతంతో బాధపడుతూ వీల్‌ చైర్‌కు పరిమితమవుతాడు. రామ, తన భార్య మహతి (అనుష నూతుల)తో కలిసి ఇంటికి తిరిగి వస్తాడు. ఇక్కడ నుండి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.

Read Also : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

రామ స్నేహితుడు నాగేష్ అప్పు కోసం ఇంటికి వస్తాడు. కానీ రామ అతన్ని గొంతు కోసి చంపేస్తాడు. యామిని ఈ హత్యను చూసి భయపడుతుంది. కానీ లక్ష్మణ్ ఆమెను ఇన్వెస్టిగేషన్ భయంతో నోరు మూయమని ఒప్పిస్తాడు. ఇంతలో సదాశివ రావు స్నేహితుడు వాసుకి, ఈ కుట్ర గురించి తెలుసుకుంటాడు. దీంతో రామ, లక్ష్మణ్‌లు అతన్ని కూడా చంపేస్తారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయట పడుతుంది. చివరికి ఈ అన్నదమ్ములు ఇద్దరో సాయం చేసిన తమ భార్యలనే చంపాలని ప్లాన్ చేస్తారు. కథలో అసలు ట్విస్ట్ ఏంటి? ఈ అన్నదమ్ములు ఇద్దరూ ఎందుకు వరుసగా మర్డర్స్ చేస్తున్నారు? చివరికి ఇద్దరన్నదమ్ముల భార్యలు ఏం చేశారు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×