E-Paper
Advertisement

Bengaluru fridge Murder: బెంగుళూరు ఫ్రిడ్జ్ మర్డర్ కేసులో నిందితుడు మృతి.. ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్న హంతకుడు

Bengaluru fridge Murder: బెంగుళూరు ఫ్రిడ్జ్ మర్డర్ కేసులో నిందితుడు మృతి.. ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్న హంతకుడు
Advertisement

Bengaluru fridge Murder: బెంగుళూరు నగరంలో కొన్ని రోజుల క్రితం మహాలక్ష్మి (29) అనే యువతిని హత్య చేసి ఆమె శవాన్ని ముక్కలు నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత పోలీసులకు తెలియడంతో ఆమె శవం కుళ్లిపోయిన పరిస్థితిల లభ్యం అయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా.. తాజాగా అతను ఒడిశాలోని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు బుధవారం తెలిపారు.

పోలీసులు మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడు రాయ్ కోసం గాలిస్తుండగా.. బుధవారం ఉదయం అతను ఒడిశాలో ఉన్నట్లు తెలిసింది. దీంతో కర్ణాటక హోమ్ మంత్రి జి.పరమేశ్వర పోలీసులకు వెంటనే ఒడిశా వెళ్లి రాయ్ ని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసుల పలు బృందాలు ఒఢిశాకు బయలుదేరాయి. అయితే పోలీసులు ఒడిశా చేరిన సమయానికి నిందితుడు ఒక ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

బెంగుళూరు మహాలక్ష్మి మర్డర్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత నిర్భయ ప్రొగ్రామ్ కింద మహిళల భద్రత కోసం బెంగుళూరులో చర్యలు తీసుకుంటున్నామని, సిసిటీవి కెమెరాల సంఖ్య కూడా పెంచుతున్నామని హోమ్ మంత్రి పరమేశ్వర తెలిపారు.

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో 2022 సంవత్సరంలో శ్రద్ధా వాల్కర్ అనే మహిళను ఇదే తరహాలో హత్య చేసి.. హంతకుడు ఆమె శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. బెంగుళూరులో మహాలక్ష్మి శవాన్ని ఆమె తల్లి, సోదరి ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉన్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసు దేశమంతా సంచలనంగా మారింది.

Also Read: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×