E-Paper
Advertisement

Fighting Between Customers: జ్యూస్ సెంటర్ వద్ద ఫైటింగ్.. ఎనిమిది మందికి గాయాలు, ఎలా జరిగింది?

Fighting Between Customers: జ్యూస్ సెంటర్ వద్ద ఫైటింగ్.. ఎనిమిది మందికి గాయాలు, ఎలా జరిగింది?
Advertisement

Fighting Between Customers: కొందరు వ్యక్తులు ఓ జ్యూస్ షాప్‌కి వెళ్లారు. వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలీదు. మాటా మాటా పెరిగి వివాదానికి దారి తీసింది. దీంతో జ్యూస్ షాపులో ఉన్న కత్తులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.

అసలు డీటేల్స్‌లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని పిల్లర్ నెంబర్ 209 వద్ద రాయల్ జ్యూస్ సెంటర్‌కు కొందరు కస్టమర్లు వచ్చారు. అప్పుటివరకు ఎవరికివారు మాట్లాడుకున్నారు. అంతలో ఏం జరిగిందో తెలీదు. ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.. పంచ్‌లు విరిసుకున్నారు.

Advertisement

ఇరువర్గాల్లో ఆగ్రహం తారాస్థాయికి చేరింది. షాపు యజమానిపై సుమారు 10 నుండి 15 మంది కత్తులతో దాడి చేశారు. జ్యూస్ షాపులో కత్తులు తీసుకుని దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది.

కత్తి, ఇసుప రాడ్లు, స్క్రూ డ్రైవర్ లతో జరిగిన దాడిలో సుమారు 8 మంది వరకు గాయపడ్డారని జ్యూస్ సెంటర్ సిబ్బంది చెబుతున్నమాట. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ALSO READ:  బెంగుళూరు ఫ్రిడ్జ్ మర్డర్ కేసులో నిందితుడు మృతి.. ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్న హంతకుడు

బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలు కారణంగా గొడవ జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఘటనకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×