BigTV English

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Bengaluru News: దంపతుల మధ్య అనుమానం పెనుభూతమైంది. రోజురోజుకూ వారి మధ్య మనస్పర్థలు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించలేదు. ఫలితంగా బస్టాండ్‌లో అందరూ చూస్తుండగా భార్యని 11 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు ఆమె భర్త. ఈ ఘటన 13 ఏళ్ల కూతురు ముందు చోటు చేసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరు సిటీలో వెలుగు చూసింది.


కర్ణాటకలోని హసన్‌ జిల్లా చన్నరాయపట్నానికి చెందిన రేఖ వివాహం జరిగింది. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో 12 ఏళ్ల కూతురు ఉంది. కుటుంబ కలహాల కారణంగా భర్తను వదిలేసింది. ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు నగరంలో ఉంటోంది.  ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది రేఖ.

అదే సమయంలో తుమకూరు జిల్లాకు చెందిన లోకేష్ లోహితాశ్వతో రేఖకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దాదాపు ఏడాది కావస్తోంది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. ఇలా ఎన్నాళ్లు అంటూ మూడు నెలల కిందట రేఖ-లోహితాశ్య వివాహం చేసుకున్నారు. అంతకుముందు తాను పని చేస్తోన్న ప్రైవేట్ కంపెనీలో లోకేశ్‌కు డ్రైవర్‌గా ఉద్యోగం ఇప్పించింది.


మ్యారేజ్ తర్వాత ఈ జంట కెబ్బేహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఉద్యోగం అన్న తర్వాత అందరితో క్లోజ్‌గా ఉండాలి. అదే ఆమె పాలిట శాపమైంది. ఈ క్రమంలో రేఖ.. ఆ కంపెనీలో ఓ వ్యక్తితో క్లోజ్‌గా ఉండడం లోహితాశ్వకు అనుమానం మొదలైంది.

ALSO READ: దొంగల బీభత్సం.. రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

ఆ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఏర్పడిందనే అనుమానాలు రెట్టింపు అయ్యాయి. ఈ కారణంగా ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి. చివరకు భర్త నుంచి రేఖ దూరంగా ఉంటోంది. భర్త లోకేష్ ఉండలేకపోయాడు. రేఖను కలవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

సోమవారం రాత్రి మాగడి రోడ్డులో సుంకదకట్టె బస్టాండులో రేఖ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆమె భర్త. కూతురితో కలిసి రేఖ వస్తోంది. ఆమెని ఆపి అక్కడే గొడవపడ్డాడు. కారులోకి ఎక్కాలని భార్యని రేఖని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు.

పట్టరాని కోపంతో అందరూ చూస్తుండగా రేఖపై కత్తితో దాడి చేశాడు ఆమె భర్త లోకేష్. ఏకంగా 11 సార్లు కత్తితో పొడిచి తన పగ తీరిన తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా రేఖను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కానీ అప్పటికే ఆమె మరణించింది.

కూతుర్ని చన్నరాయపట్నలోని రేఖ తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. 13 ఏళ్ల కూతురు ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు ఆమె భర్త. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదు అయ్యింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.

Related News

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

kolkata: కోల్‌క‌తాలో భారీ వ‌ర్షం.. ఐదుగురు మృతి!

Building Collapse: కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు సజీవ సమాధి

Khammam: ఖానాపురంలో దారుణం.. కూర వేయలేదని మహిళపై గొడ్డలితో దాడి

Kerala News: భార్యని చంపిన భర్త.. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో లైవ్, అసలు మేటర్ ఇదీ?

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Big Stories

×