Bengaluru Crime: వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఇద్దరి వయస్సు సుమారు 27 ఏళ్లు ఉంటాయి. మరి ఏం జరిగిందో తెలీదు. కోరుకున్న ప్రియుడు పట్టించుకోలేదని ప్రియురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తర్వాత ఇంటికి పిలిచి దాగుడు మూతల ఆట మొదలు పెట్టింది. ఆపై పైలోకానికి పంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది.
బెంగుళూరులో ఊహించని ఘోర.. ప్రియుడితో దాగుడుమూతల ఆట
బెంగుళూరు సిటీలోని రాజాజీనగర్ సర్కిల్ సమీపంలో ఓ స్టోర్‌లో పని చేస్తున్నాడు 27 ఏళ్ల కిరణ్. ఆ సమయంలో ఓ యువతితో రిలేష్ షిప్ పెంచుకున్నాడు.. ప్రేమలో పడ్డాడు. వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమ వైపు దారి తీసింది. ఏడాది పైగా వారిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఉన్నట్లుండి ఏం జరిగిందో తెలీదు.
ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని భావించింది అతడి ప్రియురాలు. కిరణ్ తనను పెళ్లి చేసుకోవడం భావించింది. మంగళవారం ఆ ప్రియురాలు.. తల్లి-అన్న నివాసం ఉంటున్న దక్షిణ బెంగళూరులోని అంజనాపుర ప్రాంతానికి కిరణ్‌కి ఫోన్ చేసింది చెప్పింది. కుటుంబసభ్యుల వద్దకు అనేసరికి కిరణ్ మంగళవారం మధ్యాహ్నం ప్రియురాలి ఇంటికి వెళ్లారు.
ఇంటికి పిలిచి, ఆ పని కానిచ్చిన ప్రియురాలు
అప్పటికి ఇంట్లో ఎవరూ లేరు. కేవలం కిరణ్ ప్రియురాలు మాత్రమే ఉంది. కొంతసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో ఏం జరిగిందో తెలీదు. ప్రియుడి కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చో బెట్టింది. ఇదేంటని ప్రియుడు అభ్యంతరం చెప్పాడు. ఫారెన్‌లో ఫేమస్ అయిన విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని మనసులోని మాట ఆ యువతి చెప్పింది.
నిజమేనని నమ్మేశాడు కిరణ్. దాని వెనుక హత్య జరుగుతుందని పసిగట్ట లేకపోయాడు. ప్రియురాలు ఏ విధంగా ప్రపోజల్ చేస్తుంది ఎదురు చూశాడు కిరణ్. ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్‌ని ప్రియుడిపై చల్లింది. ఆ తర్వాత నిప్పు పెట్టింది. అతడు మంటల్లో కాలిపోతోంటే కెమెరాతో చిత్రీకరించింది ప్రియురాలు.
చనిపోయే వరకు అలాగే చూస్తూ ఉండిపోయిందట. ఇంట్లో మంటలు, అరుపులు రావడంతో స్థానికులు డోర్లు పగలగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన సమయంలో తాను బాత్రూంలో ఉన్నానని ప్రియురాలు చెప్పింది. బయటకు వచ్చి చూసేసరికి కిరణ్ మంటల్లో చిక్కుకుని ఉన్నాడని తెలిపింది.
ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కిరణ్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తేలింది. వెంటనే నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై నిందితురాలు సోదరుడు మాట్లాడాడు. ఘటన సమయంలో తాను అక్కడ లేదని, తన అక్క ఇంట్లో ఉన్నానని చెప్పారు.
ALSO READ: ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ బిగ్ స్కామ్.. 2.65 కోట్ల ఘరానా మొసం!
ఇరుగుపొరుగు వారు ఫోన్ చేసి చెప్పారని తెలిపాడు. ఇంటికి వచ్చేసరికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉన్నారని, కిరణ్ ఇంట్లో చనిపోయి ఉండటాన్ని చూసి షాకైనట్టు వివరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.