BigTV English

Friend Deadbody In Bed : ‘వెంకీ’ మూవీ తరహా హత్య.. ఉదయం నిద్రలేవగానే పక్కన శవం!

Friend Deadbody In Bed : ‘వెంకీ’ మూవీ తరహా హత్య.. ఉదయం నిద్రలేవగానే పక్కన శవం!

Friend Deadbody In Bed | నటుడు రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమా గుర్తుందా?.. అందులో రైలు ప్రయాణం సీన్లలో కామెడీ బాగా పండింది. అయితే రైలు ప్రయాణం చివర్లో అందరూ ఉదయం నిద్రలేవగానే హీరోయిన్ స్నేహితురాలి శవం కనిపిస్తుంది. అందరూ ఆమె నిద్ర పోతోందని అనుకుంటారు. కానీ దెగ్గరకు వెళ్లి చూస్తే.. రాత్రికి రాత్రి ఎవరో ఆమె గొంతు కోసం హత్య చేసినట్లు తెలుస్తుంది. అచ్చం ఇదే తరహాలో నిజజీవితంలో కూడా జరిగింది. రాత్రి ఒక గదిలో పక్క పక్కనే పడుకున్న ఇద్దరు స్నేహితులలో ఒకరు ఉదయం నిద్ర లేవగానే పక్కన ఉన్న ఫ్రెండ్ శవమై కనిపిస్తుంది. ఆమెను ఎవరో నిద్రపోతుంగా గొంతుకోసి హత్య చేశారు. ఆ మహిళ హత్య కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది.


బెంగుళూరు నగరంలోని విశ్వేశరయ్య లే అవుట్ ప్రాంతంలో నివసించే నవ్యశ్రీ (28) , కిరణ్ (31) అనే దంపతులకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన ఏడాది తరువాత నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కిరణ్ జీవనం సాగించడానికి క్యాబ్ డ్రైవర్ పనిచేసేవాడు. కిరణ్ తన భార్య నవ్య శ్రీ కు వివాహేతర సంబంధం ఉందని ఎప్పుడూ అనుమాన పడేవాడు. నవ్య శ్రీ ఒక డాన్స్ ఇన్స్‌ట్రక్టర్ కావడంతో ఆమెకు తన స్టూడెంట్స్ తో అక్రమ సంబంధాలున్నాయని కిరణ్ చెప్పేవాడు. ఈ కారణంగా నవ్యశ్రీ అతనితో గొడవపడేది.

అయితే ఇటీవల జరిగిన గొడవలో కిరణ్ తన భార్యను కొట్టాడు. ఆ తరువాత క్యాబ్ తీసుకొని వెళ్లిపోయాడు. భర్త తనపై చేయిచేసుకోవడంతో నవ్యశ్రీ ఓపిక నశించింది. ఆమె తన బాధ ఎప్పుడూ తన ఇద్దరు స్నేహితులు అయిన ఐశ్వర్య, అనిల్ తో పంచుకునేది. ఈ సారి కూడా తన కష్టాన్ని చెప్పుకునేందకు ఐశ్వర్యకు ఫోన్ చేసింది. ఐశ్వర్య వెంటనే నవ్యశ్రీ ఇంటికి వచ్చింది.


Also Read: భర్త ఎదురుగానే ప్రియుడితో తిరిగే భార్య.. చివరికి ఏమైందంటే!

వారిద్దరూ మాట్లాడుకుంటుండగా.. కిరణ్ ఫోన్ చేసి తాను రాత్రి ఇంటికి రావడం లేదని చెప్పాడు. దీంతో ఇద్దరు స్నేహితులు బయటికి వెళ్లారు. అక్కడ వారిద్దరి కామన్ ఫ్రెండ్ అనిల్ ఉన్నాడు. ఒక హోటల్ లో ముగ్గురూ కలిసి డిన్నర్ చేశారు. ఆ సమయంలో అనిల్.. నవ్య శ్రీకి ఒక సలహా ఇచ్చాడు. భర్త తనను కొట్టాడు కాబట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. కిరణ్ చిత్రహింసలు పెడుతున్నాడని అతనిపై గృహహింస కేసు పెట్టమని సూచించాడు. డిన్నర్ ముగిసిన తరువాత అనిత్ తన ఇంటికి వెళ్లిపోగా.. నవ్యశ్రీ, ఐశ్వర్య.. నవ్యశ్రీ ఇంటికి వచ్చేశారు. ఎలాగూ కిరణ్ రాత్రి రావడం లేదు కాబట్టి ఐశ్వర్య ఆ రోజు రాత్రి నవ్యశ్రీ గదిలోనే నిద్రపోయింది.

అయితే ఉదయం 6 గంటలకు నిద్రలేచిన ఐశ్వర్య పక్కన ఏదో తడితడిగా ఉండడంతో పక్కకు తిరిగి చూసింది. అంతే.. ఒక్కసారి కేకలు వేసింది. రక్తంలో తడిసిన నవ్యశ్రీ శవం కనిపించింది. ఎవరో రాత్రి నవ్యశ్రీని గొంతు కోసి హత్య చేశారు. ఐశ్వర్య పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని.. ఐశ్వర్యని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత నవ్యశ్రీ, ఆమె భర్త మధ్య గొడవల విషయం తెలిసి.. కిరణ్ ని కూడా అరెస్టు చేశారు. కిరణ్ వద్ద ఇంటి మరో తాళం చెవి ఉండడంతో అతనే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×