E-Paper
Advertisement

BREAKING: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెట్

BREAKING: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెట్
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లో భవనం సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బీహార్, సూర్యాపేటకు చెందిన వాసులుగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

వివరాల ప్రకారం.. సెల్లార్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతుండగా మట్టిిదిబ్బలు విరిగిపడి వాటి కింద కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో సూర్యాపేట, బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్‌ సిబ్బంది, పోలీసులు, డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్‌ కోసం తీసిన రంధ్రాలు లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణం కోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్‌ నిర్మించేందుకు పనులు చేపడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైల్స్‌లో కాంక్రీట్ నింపుతుండగాపై నుంచి మట్టిదిబ్బలు జారి పడిపోవడంతో కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు.

Advertisement

Also Read: Junior Court Assistant Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో కోర్టులో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.72,000

భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్‌ నుంచి వచ్చిన కార్మికులు విధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×