Mangalavaaram 2 : ఎమోషనల్ స్టోరీ తో, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లతో, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో, అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ ‘మంగళవారం’ (Mangalavaaram). టాక్ బాగానే వచ్చినప్పటికీ ఈ మూవీకి కలెక్షన్స్ అయితే పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలోనే ‘మంగళవారం 2’ (Mangalavaaram 2) గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
‘మంగళవారం 2’ మూవీ లేటెస్ట్ అప్డేట్
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajputh) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మంగళవారం’. 2023 లో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ‘మంగళవారం’ (Mangalavaaram) సినిమాను తెరకెక్కించారు. ఇందులో నందిత శ్వేతా, దివ్య పిళ్లై, కృష్ణ చైతన్య, అజయ్ గోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ‘మంగళవారం 2’కు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అజయ్ భూపతి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశారట. త్వరలోనే మూవీ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి ఉన్న బజ్ దృష్ట్యా ఓ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నిర్మాణంలో భాగం కాబోతోందని తెలుస్తోంది.
ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఆయన సంగీతంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజపుత్ కూడా హైలెట్ అయింది. కానీ ఆమె అభిమానులకు బాడ్ న్యూస్ ఏంటంటే ‘మంగళవారం 2’ (Mangalavaaram 2) ప్రీక్వెల్లో హీరోయిన్ ఆమె కాదు. మేకర్స్ ప్రస్తుతానికి ఓ ప్రముఖ హీరోయిన్ తో ఈ మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే హీరోయిన్ విషయంపై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ‘మంగళవారం’ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవారం 2’ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
18 సెంచరిలో ప్రీక్వెల్ స్టోరీ ?
మహాలక్ష్మిపురం అనే గ్రామంలో ప్రతి మంగళవారం ఇద్దరిద్దరు చొప్పున చనిపోతారు. అలా చనిపోయిన జంటలకు అక్రమ సంబంధం ఉందన్న విషయాన్ని ముందు రోజు రాత్రి ఎవరో గోడలపై రాస్తారు. అయితే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ అవి ఆత్మహత్యలు కాదు హత్యలు అని డిసైడ్ అవుతుంది. కానీ వారి శవాలకు పోస్టుమార్టం నిర్వహించడానికి ఆ ఊరి జమీందారు అడ్డు చెబుతాడు. ఆ తర్వాత మాత్రం ఎస్సై శవాలని పోస్ట్ మార్టంకి పంపించడంతో, ఊర్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఇంతకీ మంగళవారం మాత్రంమే ఎందుకు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి? గోడల మీద ఎవరు అలా రాస్తున్నారు? ఆ ఊరి జమీందారు భార్యకి, ఈ హత్యలకు గల సంబంధం ఏంటి ? ఇందులో హీరోయిన్ పాత్ర ఏంటి ? అనే మిస్టరీనే ఈ మూవీ స్టోరీ. ‘మంగళవారం 2’ని 18 సెంచరీ, గోదావరి స్టోరీగా తెరపైకి తీసుకురానున్నారని టాక్ నడుస్తోంది.