Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. తొలి గంటలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. అనంతరం ఎక్స్ తన భావాలను వ్యక్తం చేశారు రాహుల్‌గాంధీ.
ఇవాళ ఓటు వేయడానికి మీరందరూ వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు మీరు వేసే ప్రతి ఓటు మీ హక్కులను కాపాడుతుందని మనసులోని మాట వెల్లడించారు. రాజ్యాంగాన్ని బలోపేతం చేస్తుందని, ఢిల్లీని తిరిగి ప్రగతి పథంలో నడిపిస్తుందని ప్రస్తావించారు.
ఓటు వేసేటప్పుడు కలుషితమైన గాలి, మురికి నీరు, పాడైన రోడ్లకు బాధ్యులు ఎవరో గుర్తుంచుకోవాలని సున్నితంగా ఆమ్ ఆద్మీ పార్టీపై సెటైర్లు వేశారు. స్వచ్ఛ రాజకీయాలు చేస్తామని చెప్పి ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు? అంటూ ప్రశ్నించారు. గడిచిన పదేళ్లు ఏఏపీలో ఢిల్లీలో అధికారంలో ఉంది. ఈ క్రమంలో వాటిపై ప్రస్తావించారన్నది కాంగ్రెస్ నేతల మాట.
అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మీ ఓటు ఢిల్లీలో మార్పుకు ప్రతీక అని రాసుకొచ్చారు. ఢిల్లీ మునుపటి మాదిరిలా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే, పని చేసిన వారిని ఎన్నుకోవాలన్నారు.
ALSO READ: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్.. శంతను నాయడుకు టాటా మోటార్స్‌లో కిలక పదవి
తప్పుడు వాగ్దానాలు చేసి మిమ్మల్ని మోసం చేయలేదన్నారు. పాడైన రోడ్లు, మురికి నీరు, కలుషిత గాలి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కేవలం సాకులు చెప్పేవారు ఈవీఎం బటన్‌ను నొక్కే ముందు మీ గురించి ఎంత శ్రద్ధ వహిస్తారో ఆలోచించాలన్నారు.
కేవలం కుస్తీ పట్టి అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకునే వారు మీ ఓటుకు అర్హులు కారని పేర్కొన్నారు. సోదరభావం, సామరస్యం, శ్రేయస్సు అందరితో కూడిన అభివృద్ధి చాలా ముఖ్యమైనవి రాసుకొచ్చారు. ఢిల్లీని ప్రగతి పథంలో నడిపించిన వారినే ఎన్నుకోవాలన్నారు. ఈ ప్రజాస్వామ్య ఉత్సవానికి మిమ్మల్ని స్వాగతించాలని, ఓటింగ్‌లో పాల్గొనాలని యువతను, ముఖ్యంగా మొదటిసారి ఓటర్లను అభ్యర్థించారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రియాక్ట్ అయ్యింది. బీజేపీ ప్రజల ఓటు హక్కును హరిస్తోందని రాసుకొచ్చింది. ఓటింగ్‌లో పాలుపంచుకోలేని విధంగా ఢిల్లీలో అమాయక ప్రజల చేతి వేళ్లపై బీజేపీ సిరా వేస్తోందన్నారు. ఈ విధంగా బీజేపీ.. పౌరుల ఓటు హక్కును, పౌరుడిగా ఉండడాన్ని హరిస్తోందన్నారు. ఇదంతా ఢిల్లీ పోలీసులు, ఎన్నికల సంఘం సమక్షంలో జరుగుతున్నా ఇద్దరు మౌనంగా ఉన్నారని ప్రస్తావించింది.
హస్తిన పీఠానికి దాదాపు మూడు దశాబ్దాలుగా దూరమైంది బీజేపీ. ఈసారి ఎలాగైనా ఢిల్లీ కుర్చీని దక్కించుకోవాలని ఉవ్విల్లూరుతోంది. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. దశాబ్దంపాటు అధికారంలో ఉన్న ఏఏపీ, ఎన్ని వివాదాలు ఎదురైనా మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని కుండబద్దలు కొడుతోంది. కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంగా హస్తిన పీఠానికి దూరమైంది. సింపుల్‌గా చెప్పాలంటే గడిచిన కొన్నేళ్లు అక్కడి కుర్చీ జాతీయ పార్టీలకు అందని దాక్షగానే మిగిలింది.
ఆప్ సర్కార్ పై రాహుల్ గాంధీ విమర్శలు
స్వచ్ఛ రాజకీయాలు చేస్తామని అతిపెద్ద కుంభకోణం చేసింది ఎవరు?
కలుషిత గాలి, మురికి నీరు, పాడైన రోడ్లకు బాధ్యులు ఎవరో ఓటర్లు గుర్తుంచుకోవాలి
రాజ్యాంగాన్ని బలోపేతం చేసే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని
మీరు వేసే ఓటు ఢిల్లీని తిరిగి ప్రగతి… https://t.co/pvXyRraEPL pic.twitter.com/boLvkQyIuf
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025