BigTV English

Brother In law kills: రెండు నెలలపాటు అత్తారింట్లోనే అల్లుడు.. మరదలిని ఏం చేశాడంటే

Brother In law kills: రెండు నెలలపాటు అత్తారింట్లోనే అల్లుడు.. మరదలిని ఏం చేశాడంటే

Brother In law kills| భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సాధారణం. అయితే ఆ గొడవలు హింసాత్మకంగా కూడా మారిపోతుంటాయి. ఇలాంటి ఘటనల గురించి అప్పుడప్పుడూ వార్తల్లో వింటూనే ఉంటాం. అలాంటిదే ఒక ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. అయితే ఈ ఘటనలో ఒక భర్త తన మరదలిని హత్య చేసి భార్యపై కూడా దాడిచేశాడు. ఆ తరువాత తనని తాను కాల్చుకున్నాడు.


పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాజధాని పట్నాకు సమీపంగా ఉన్న బిగాహ అనే గ్రామంలో నివసించే దీపక్ కుమార్ (32) అనే యువకుడికి అయిదేళ్ల క్రితం లక్ష్మీ దేవి (27) అనే యువతితో వివాహం జరిగింది. వీరికి సంతానం కలుగలేదు. పైగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే ఇటీవల లక్ష్మీ దేవి తన భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.

దీపక్ కుమార్ కూడా ఆమె కోసం తన అత్తారింటికి వచ్చాడు. ఈ క్రమంలో ఆమె తనతో తిరిగి రావాలని ఎంత నచ్చచెప్పినా ఆమె వినలేదు. అందుకే ఆమె తనతో వచ్చేంత వరకు తాను కూడా అక్కడే ఉంటానని నిర్ణయించుకున్నాడు. అలా అత్తారింట్లో అల్లుడు దీపక్ కుమార్ రెండు నెలలుగా తిష్ట వేశాడు. ఈ క్రమంలో దీపక్ పై అతని మరదలు గుడియా దేవి మనసు పడింది. తననకు వివాహం చేసుకోవాలని వెంటపడింది. కానీ దీపక్ కుమార్ ఆమెను తిరస్కరించాడు.


Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

మరోవైపు దీపక్ రెండు నెలలుగా ఉద్యోగానికి రానుందన అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనంతటికి దీపక్ తన భార్యను నిందించాడు. అలా వారద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరుగుతుండగా దీపక్ కుమార్ జీవితంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అందుకోసం ఒక తుపాకీ తీసుకొని తన భార్య ఎదుట నిలబడి తనతోపాటు రావాలని లేకపోతే కాల్చుకుంటానని బెదిరించాడు. కానీ లక్ష్మీదేవి ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో అక్కడికి దీపక్ మరదలు గుడియా దేవి వచ్చింది. ఆమె దీపక్ చేతినుంచి తుపాకీ లాక్కునే క్రమంలో దీపక్ రెండు సార్లు కాల్పులు జరిపాడు. అందులో ఒక బుల్లెట్ గుడియా దేవి ఛాతిభాగంలో తగిలింది. ఈ అనూహ్య ఘటన కారణంగా దీపక్ పట్టరాని కోపంతో దీనంతటికీ తన భార్య లక్ష్మీ దేవి కారణమని ఆమెపై కాల్పులు జరిపి.. తనను తాను కాల్చుకున్నాడు.

తుపాకీ కాల్పులు శబ్దాలు విని పొరుగింటివారు, లక్ష్మి దేవి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. దీపక్, అతని భార్య, మరదలు కిందపడి ఉండడం చూసి ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సమాచారం అందుకొని వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో దీపక్, గుడియా దేవి చనిపోగా.. లక్ష్మీ దేవి ప్రాణాలతోనే ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

ఇలాంటిదే మరో కేసులో బిహార్ భాగల్ పూర్ ప్రాంతంలో ఒక యువకుడు తన మరదలిని తీసుకొని పారిపోయాడు. ఆ తరువాత పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. కోర్టు అతనికి రూ.500 జరిమానా, 9 నెలల జైలు, 25 మొక్కలు నాటాలని శిక్ష వేసింది.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×