BigTV English

Vedhika : సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది.. ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధం చేసుకుంటోంది వేదిక

Vedhika : సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది.. ఇప్పుడు భయపెట్టేందుకు సిద్ధం చేసుకుంటోంది వేదిక

Actress Vedhika coming with her latest movie Fear movie..poster launched: మహారాష్ట్రకు చెందిన సోలాపూర్ వాసి వేదిక. మోడల్ గా కెరీర్ ఆరంభించింది. తమళ డబ్బింగ్ మూవీ శివకాశితో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చిన్న హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన వేదికకు అంతగా గుర్తింపు తెచ్చిన పాత్రలేమీ రాలేదు తెలుగులో. కల్యాణ్ రామ్ తో కలిసి విజయదశమి చిత్రం చేసినా అది యావరేజ్ గా ఆడింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేసింది వేదిక. చూడగానే ఆకట్టుకునే రూపం, అభినయం అన్నీ ఉన్నా లక్కు మాత్రం కలిసిరాలేదు ఈ బ్యూటీకి. అయితే కొంత కాలం గ్యాప్ తీసుకున్న వేదిక కనీసం సోషల్ మీడియాలోనూ చురుకుగా లేరు.


నాడు యక్షిణిగా..

ఇటీవల వేదిక నటించిన వెబ్ సిరీస్ బాగానే ఆకట్టుకుంది ప్రేక్షకులను. తమిళ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల అయింది. యక్షిణి పేరుతో ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇద్దామనుకుంటోంది వేదిక. ప్రస్తుతం ‘ఫియర్’ అనే సస్సెన్స్ థ్రిల్లర్ మూవీతో రాబోతోంది. మూవీ అంతా వేదిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా విడుదల చేశారు. వేదిక ఒక్కతే కనిపిస్తుంది ఈ పోస్టర్ లో. చీకట్లో ఒక్కతే కూర్చుని భయపెడుతోంది.


Also read: రజనీకాంత్ కు పెను ప్రమాదమే తప్పింది.. ఊపిరి పీల్చుకున్న ‘కూలీ’ యూనిట్

ప్రభుదేవా ట్వీట్

అతి త్వరలోనే థియేటర్లలో ఈ ‘ఫియర్’ మూవీ సందడి చేయనుంది. ఈ సందర్భంగా ప్రభుదేవా సినిమా సక్సస్ కావాలని పోస్టర్ లాంచ్ లో వేదిక లుక్ భయపెడుతోందని..థియేటర్లలో ఈ మూవీని భయపడుతూ ఎంజాయ్ చేయాలని ట్వీట్ చేశారు ప్రభుదేవా. మొన్న యక్షిణి, నేడు ఫియర్ అన్నీ భయపెట్టే సినిమాలే చేస్తావా అని వేదికను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చి అందరి హీరోలతోనూ నటించాలని మరికొందరు నెటిజెన్స్ కోరుకుంటున్నారు వేదికను.

Related News

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Big Stories

×