BigTV English

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో నక్సలైట్లు ఐఏడీ బాంబుల పేల్చడంతో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు చనిపోగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఘటన ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్, పోలీసుల జాయింట్ టీమ్ నక్సలైట్ల గురించి సమాచారం అందుకొని బుధవారం బీజాపూర్, సుక్మీ, దంతెవాడ జిల్లాల పరసర అడవుల్లోకి వెళ్లారు. రాత్రి అడవుల్లోకి తిరిగి వస్తున్న సమయంలో నక్సలైట్లు ఐఏడీ బాంబుల పేల్చడంతో ఇద్దరు మృతి చెందారు. గాయాలపాలైన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఓ పోలీస్ అధికారి తెలిపారు.


రాష్ట్ర పోలీసు విభాగంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ లతో పాటు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF), కోబ్రా ఎలైట్ జవాన్లు నక్సలైట్ ఆపరేషన్ లో పాల్గొన్నారు. మంగళవారం నక్సలైట్ల ఉన్న ప్రదేశాల గురించి ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో నాలుగు యూనిట్లు ఆపరేషన్ కోసం బయలుదేరాయి. నక్సలైట్లు దర్భ, పశ్చిమ బస్తర్, మిలిటరీ కంపెనీ నెంబర్ 2 ప్రాంతాల్లో ఉన్నట్లు తెలిసింది.

Also Read: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!


చనిపోయిన ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ లో రాయ్ పూర్‌కు చెందిన భరత్ సాహు, నారాయణ్ పూర్ కు చెందిన సత్యేర్ సింగ్ కాంగె ఉన్నారు. వీరిద్దరూ బాంబు పేలుడు జరిగిన సమయంలో.. పేలుడికి అతిసమీపంలో ఉండడంతో స్పాట్ లోనే చనిపోయారు.

బాంబు పేలుడు ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు అదనపు బలగాలను ఘటనా స్థలానికి రవాణా చేశారు. గయపడిన నలుగురిని వెంటనే వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

మహారాష్ట్ర-ఛత్తీస్ గడ్ బార్డర్ లో 12 నక్సల్స్ మృతి
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో బుధవారం నక్సల్స్-మహారాష్ట్ర పోలీసుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్‌లో 12 మంది నక్సలైట్లు చనిపోయారు. గడ్చిరోలి జిల్లా.. ఝార్ వండి పోలీస్ స్టేషన్ పరిధిలో పివి82, ఛింద్ భట్టి మధ్య ఉన్న అరణ్య ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య మహారాష్ట్ర పోలీసులు, నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.

దాదాపు ఆరు గంటలపాటు ఎన్ కౌంటర్ లో 12 మంది చనిపోగా.. కొంతమంది తప్పించుకున్నారని సమాచారం. చనిపోయిన నక్సలైట్ల నుంచి అడ్వాన్స్ డ్ ఆటోమేటిక్ ఆయుధాలున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×