BigTV English

Chaturmas 2024: చతుర్మాసంలో ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు !

Chaturmas 2024: చతుర్మాసంలో ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు !

Chaturmas 2024: తొలి ఏకాదశి నుంచి చతుర్మాసం ప్రారంభం అవుతుంది. మహా విష్ణువు యోగనిద్రలోకి ప్రవేశించిన నాలుగు నెలల సమయాన్ని చతుర్మాసంగా పిలుస్తుంటారు. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించరు. చతుర్మాసంలో పూజలు, దానధర్మాలు, పుణ్యకార్యాలు చిత్తశుద్ధితో చేస్తే ఫలితం వస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది చైత్రమాసంలో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధి యోగం సహా అనేక శుభ యోగాలున్నాయి.


ఈ సమయంలో శివుడు, విష్ణువును పూజించడం వల్ల మంచి పలితాలు పొందుతారు. మత విశ్వాసాల ప్రకారం దేవతలు విష్ణువును ఆషాఢ మాసంలో పూజిస్తారు.
ఏకాదశి రోజు పూజ :
కార్తీక మాసం శుక్లపక్షంలో ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటాడు. అందుకే చతుర్మాసంలో సనాతన ధర్మంలో ఎలాంటి కార్యాచరణలు జరగదు.
చతుర్మాసంలో చేయాల్సిన పనులు :
చతుర్మాస సమయంలో పూజలు చేయడం చేస్తుంటారు. సాధువులు కూడా ఈ మాసంలో ధ్యానం చేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. మహావిష్ణువు సోత్రాలు, భగవద్గీత, పఠనం చేయడం చతుర్మాస సమయంలో చేయాలి. పేదలకు డబ్బు, దుస్తులు, గోడుగు, చెప్పులు, ఇతర నిత్యావసరాలను దానం చేయడం మంచిది.
చతుర్మాసంలో చేయకూడని పనులు :
భూమిపూజ, వివాహం, గృహప్రవేశం, ఉపనయన సంస్కారం వంటి శుభకార్యాలు చేయకూడదు. ఏ రకమైన కొత్త పనిని కూడా ప్రారంభించకూడదు. ఈ సమయంలో ఎటువంటి పనిచేసిన కలసిరాదు. పెరుగు బెండకాయ వంటివి తినకూడదు. అబద్దాలు చెప్పకూడదు. ఇతరులను మోసం చేయకూడదు
చతుర్మాసంలో పాటించాల్సిన నియమాలు :
చతుర్మాసంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. చేపలు, మాంసం, మద్యపానం, వెల్లుల్లి ఆహారాలు తినకూడదు.చతుర్మాసంలో సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం చాలా ముఖ్యం. ఈ సమయంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం ఆచరించి క్రమం తప్పకుండా ప్రతిరోజూ పూజ చేయాలి. వీలైనంత నిశ్శబ్దంగా ఉండండి. ఎవరితోనూ వదనలు పెట్టుకోవద్దు.
చతుర్మాసం ఇలా చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది :
చతుర్మాసంలో కొన్ని నిర్దిష్టమైన పనులు చేయడం వల్ల జీవితంలో వివిధ రకాల శుభాలు కలుగుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కెరీర్ ,ప్రమోషన్ కోసం చెప్పులు, బట్టలు దానం చేయడం మంచిది .శత్రువుల నుంచి విముక్తి పొందడం కోసం మంత్రలు పటించాలి. ఇలా చేస్తే జీవితంలోని సమస్యలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా శత్రుబాధలు కూడా తొలగిపోతాయి.

Also Read: ఈ 2 రాశులపై రాహువు అనుగ్రహం.. ఇక మీ కుటుంబంలో సంపదే


రుణ భారం ఎక్కువగా ఉంటే ఆ చతుర్మాస సమయంలో అన్నదానం చేయడం మంచిది. భగవద్గీతను పటించాలి. గత ఏడాది 148 రోజుల పాటు చైత్రమాసం ఉంటే ఈ ఏడాది మాత్రం 118 రోజులు ఉంది. ఇప్పటి నుంచి కర్మలు కూడా ఈ మాసంలో ఉండవు

 

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×