E-Paper
Advertisement

Chittoor Crime: రూటు మార్చిన సైబర్ క్రిమినల్స్.. సమాచార అధికారి గ్రూప్‌లో అశ్లీల వీడియోలు, ఏం చేశారంటే

Chittoor Crime: రూటు మార్చిన సైబర్ క్రిమినల్స్.. సమాచార అధికారి గ్రూప్‌లో అశ్లీల వీడియోలు, ఏం చేశారంటే

Chittoor Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. డబ్బులకు అలవాటు పడినవారు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా ఓ జిల్లా సమాచార శాఖ అధికారి గ్రూప్‌లోకి అశ్లీల వీడియోలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

రూటు మార్చిన సైబర్ క్రిమినల్స్

సుప్రీంకోర్టు ఆదేశాలతో సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు సైబర్ క్రిమినల్స్ వ్యక్తులకు ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ బయటపెట్టడం మొదలుపెట్టారు. వారి నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరిగాయి. చివరకు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది.

దీనిపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఎవరినుంచైనా ఫోన్ వస్తే ఎవరు చేస్తున్నారనేది సులువుగా గుర్తించడం ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ ప్రాసెస్ జరుగుతోంది. పరిస్థితి గమనించిన సైబర్ నేరగాళ్లు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్‌లను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

చిత్తూరు జిల్లా సమాచార అధికారి గ్రూప్‌లో అశ్లీల వీడియోలు

తాజాగా చిత్తూరు సమాచారశాఖ అధికారి ఫోన్ హ్యాక్ కావడం కలకలం రేపింది. ఆ అధికారి సమాచార గ్రూపులోకి న్యూడ్ వీడియోలు పంపిచారు. వాటి ద్వారా ఫోన్ హ్యాక్ చేశారు. తన గ్రూప్‌లోకి ఆశ్లీల వీడియోలు రావడంలో షాకయ్యారు సదరు అధికారి. అన్ని వెరిఫై చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే అధికారులు ఆ వీడియోలను తొలగించారు. అదికారక వాట్సాప్ గ్రూపులోకి ఆ తరహా వీడియోలు రావడం తనకు తెలీదన్నారు. అవి ఎలా వచ్చాయో తనకు తెలీదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. వారి ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు.

ALSO READ:  థాయ్‌లాండ్‌లో ఘోర క్రేన్ ప్రమాదాలు,  34 మంది మృతి

నార్మల్‌గా స్మార్ట్ ఫోన్ అనేసరికి రకరకల యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తాము. వాటిలో వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ వంటివి ఉంటాయి. ఏదైనా కంటపడితే వెంటనే షూట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు యూజర్స్. ఈ మధ్యకాలంలో ఇది మరింత శృతిమించింది. ఒకప్పుడు డిజిటల్ అరెస్టులంటూ ఫోన్లు చేసే సైబర్ నేరగాళ్లు, ఈసారి నేరుగా వాట్సాప్ గ్రూపులకు వేర్వేరు వీడియోలు పంపడం కలకలం రేపుతోంది. రానున్న రోజుల్లో ఈ తరహా ఘటనలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి. కావల్సినంత  డేటా ఉందని వాడితే అడ్డంగా బుక్కవుతారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×