BigTV English

Condoms in School Bags: స్కూల్ బ్యాగుల్లో కత్తులు, కండోమ్ లు, మారణాయుధాలు..

Condoms in School Bags: స్కూల్ బ్యాగుల్లో కత్తులు, కండోమ్ లు, మారణాయుధాలు..

చిన్న పిల్లల స్కూల్ బ్యాగుల్లో ఏముంటాయి. బుక్స్, పెన్స్, పెన్సిల్స్, షార్ప్ నర్స్, ఎరేజర్స్.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా
ఇంకా చెప్పాలంటే కొంతమంది చాక్లెట్లు, బిస్కెట్లు కూడా స్కూల్ బ్యాగ్స్ లో పెట్టుకుని తెచ్చుకుంటారు. కానీ నాసిక్ లో ని ఘోటిలో స్టూడెంట్స్ స్కూల్ బ్యాగ్స్ వెదికిన టీచర్లు షాకయ్యారు. ఆ స్కూల్ బ్యాగ్స్ లో కనపడిన వస్తువులు చూసి భయపడిపోయారు. అసలు తమ స్కూల్ లో ఇలాంటి వాళ్లున్నారా అంటూ ఆందోళన చెందారు. ఆ స్కూల్ బ్యాగ్స్ వెదికేటప్పుడు తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మారణాయుధాలు..
స్కూల్ పిల్లల్లో ఇటీవల నేరప్రవృత్తి పెరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, రీల్స్ చూసి నేరాలు చేసేందుకు, నేరం చేసి తప్పించుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారు కొందరు. స్టూడెంట్స్ ఇందుకు మినహాయింపు కాదు. వాళ్లు కూడా సోషల్ మీడియాకు బాగా అడిక్ట్ అవుతున్నారు. స్కూల్ బ్యాగ్స్ లో కత్తులు, చైన్లు, చేతివేళ్లకు బిగించుకుని కొట్టే ఐరన్ హోల్డర్లు, మారణాయుధాలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఘోటి స్కూల్ లో జరిగిన చెకింగ్స్ లో కొంతమంది స్టూడెంట్స్ బ్యాగుల్లో ఇవి కనపడ్డాయి. ఇతర స్టూడెంట్స్ ని భయపెట్టడానికి ఇవి బ్యాగుల్లో పెట్టుకున్నారా, లేక బయట నిజంగానే బ్యాచ్ లు గా విడిపోయి కొట్టుకుంటున్నారా అనేదానిపై టీచర్లు విచారణ చేపట్టారు.

చివరకు కండోమ్ లు కూడా..
వారంతా హైస్కూల్ విద్యార్థులు. 7 నుంచి 10వ తరగతి చదువుతున్నారు. ఆ వయసులో శారీరక ఆకర్షణ ఉంటుంది కానీ, మరీ అది శృంగారానికి దారితీసేంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేం. కానీ ఘోటి స్కూల్ విద్యార్థులు బ్యాగుల్లో కండోమ్ లు కూడా పెట్టుకుని తిరుగుతున్నారు. తోటి పిల్లల ముందు ఫోజు కొట్టడానికి ఇలా చేస్తున్నారా, లేక వాటిని వాడేంత సాహసం కూడా చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.


నాసిక్ లోని ఘోటిలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లు చేసిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సెవన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా తన బ్యాగ్ లో కండోమ్ లు పెట్టుకున్నారు. కత్తులు, చైన్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. తమ స్కూల్ పిల్లలపై టీచర్లు ఎప్పటినుంచో నిఘా పెట్టారు. వారికి కొన్ని అనుమానాలున్నాయి. అవి నివృత్తి చేసుకోడానికే సడన్ గా స్కూల్ బ్యాగ్స్ చెక్ చేశారు. దీంతో వారికి ఇవన్నీ కనపడ్డాయి. ఇకపై ప్రతి రోజూ ఇలా స్కూల్ బ్యాగ్స్ చెక్ చేస్తామంటున్నారు స్కూల్ వైస్ ప్రిన్సిపల్. కొన్నిరోజులుగా ఈ తనిఖీలు చేపట్టామని, ఇవన్నీ వేర్వేరు విద్యార్థుల బ్యాగుల్లో బయటపడ్డాయని వైస్ ప్రిన్సిపల్ చెప్పారు.

పేరెంట్స్ రియాక్షన్ ఏంటంటే..?
స్టూడెంట్స్ స్కూల్ బ్యాగ్స్ లో కండోమ్ లు, కత్తులు చూసిన టీచర్స్.. వెంటనే వారి పేరెంట్స్ కి సమాచారం ఇచ్చారు. వారు స్కూల్ కి వచ్చి అవన్నీ చూసి షాకయ్యారు. తమ పిల్లలకు నాలుగు తగిలించారు. టీచర్లు చేసిన పనిని మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు తమ పిల్లలు అమాయకులు అనుకున్నామని, ఇలాంటివన్నీ స్కూల్ బ్యాగ్స్ లో పెట్టుకుంటారని తెలియదని చెప్పారు. ఇకపై ఇంటి వద్ద కూడా వారిపై నిఘా పెడతామంటున్నారు పేరెంట్స్. స్కూల్ టీచర్ల చొరవని వారు అభినందించారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×