Renu Desai: హీరోలు మాత్రమే కాదు.. చాలామంది హీరోయిన్లు కూడా సినిమాల తర్వాత రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది సీనియర్ హీరోయిన్లు సినిమాల్లో ఇంక అవకాశాలు రావు అని ఫిక్స్ అయిన తర్వాత రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా యాడ్ అవుతుందా లేదా అనే ఆసక్తి చాలామందిలో ఉంది. ఇప్పటికే పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సినీ జీవితాన్ని వదిలేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. మరి తన మాజీ భారీ రేణు దేశాయ్ పరిస్థితి ఏంటి.?
పవన్ కళ్యాణ్ బాటలోనే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి ఫామ్‌లో ఉన్నా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. అవన్నీ కాదని సమాజానికి సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వెళ్లారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేశారు. కానీ సినిమాల్లో సక్సెస్ వచ్చినట్టుగా రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్‌కు అంత ఈజీగా సక్సెస్ రాలేదు. తను ఎప్పటికీ సినీ నటుడే అని, రాజకీయ నాయకుడు కాలేడు అని చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అయినా కూడా పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ పొలిటికల్ లీడర్‌గా ఎదిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను ఫాలో అవుతూ తన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రాజకీయాల్లోకి వెళ్తుందా.? ఇదే ప్రశ్న తనకు ఎదురయ్యింది. దానికి తను ఆసక్తికర సమాధానమిచ్చింది.
అందులోనే ఆనందం
రాజకీయాల్లోకి వెళ్లడమనేది నా జాతకంలోనే ఉంది అని స్టేట్‌మెంట్ ఇచ్చింది రేణు దేశాయ్. గతంలో తనకు రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఛాన్స్ కూడా వచ్చిందని బయటపెట్టింది. అయితే కేవలం పిల్లల పెంపకం కోసమే అన్నింటిని పక్కన పెట్టేశానని తెలిపింది. రాజకీయం అనేది తన విధిరాతలో ఉన్నా కూడా తను వ్యతిరేకంగా వెళ్లానని చెప్పుకొచ్చింది. మరి ఇదంతా మాట్లాడిన తర్వాత ప్రేక్షకులకు కామన్‌గా వచ్చే డౌట్.. అసలు రేణు దేశాయ్ (Renu Desai)కు రాజకీయాలంటే ఆసక్తి ఉందా లేదా అని. దానికి కూడా రేణు దేశాయ్ ఆసక్తికర సమాధానమిచ్చింది. సామాజిక సేవ చేయడంలోనే ఆనందం ఉందని చెప్పింది.
Also Read: అలేఖ్య చిట్టి పికెల్స్ వివాదం.. వీడియోతో కౌంటర్ ఇచ్చిన మాధవి లత..
చేదు అనుభవం
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ బర్త్ డే కాగా ఇదే రోజు వారి కుటుంబానికి ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ స్కూల్‌లో చదువుకుంటున్నాడు మార్క్ శంకర్. అదే స్కూల్‌లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరగడంతో తన చేతికి, కాలికి గాయాలయ్యాయి. ఇక అకీరా నందన్ పుట్టినరోజునే ఇలా జరగడం దురదృష్టకరం అంటూ వెంటనే మార్క్‌ను చూడడానికి సింగపూర్‌కు బయల్దేరారు పవన్ కళ్యాణ్.