Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై.. వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మృతి చెందగా, కొందరి పరిస్థితి విమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తాండూరు డిపోకు చెందిన ఆర్టీసూ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ఘటలో టిప్పర్ డ్రైవర్ తో 21 మంది మృతి చెందారు. కొందమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్ధులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలుకళాశాలలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్టూడెంట్స్ అంతా ఆదివారం సెలవుకావడంతో ఇంటికి వెళ్లి.. తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా హైదరాబాద్–బీజాపూర్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. క్రేన్‌ల సహాయంతో లారీ, బస్సులను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను మామూలు స్థితికి తెచ్చారు.
Also Read: చెరువులో ఈత కొడుతూ.. చేపలు పడుతూ.. రాహుల్ గాంధీ ప్రచారం!
పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో లారీ డ్రైవర్.. అధిక వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు.