Bapatla Crime: అతివేగం ప్రమాదకరం.. అయినా వాహనదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బాపట్ల జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు-లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు.
బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆదివారం అర్థరాత్రి ధాటిన తర్వాత బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్లపాలెం మండలం సత్యవతిపేట ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీ కొన్నాయి. ఘటన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తుల్లో నలుగురు మృతి చెందారు. మృతులు కర్లపాలెం ప్రాంతానికి చెందిన బలరామరాజు, లక్ష్మి, పుష్పవతి, శ్రీనివాసరాజుగా గుర్తించారు.
మరో ఇద్దరుకి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన ఇద్దరు బాలురులు. వారిలో ఒకరికి 13 ఏళ్లు , మరొకరికి 11 ఏళ్లు ఉంటాయి. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను బాపట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నలుగురు వ్యక్తులు మరణించారు. గాయపడినవారిని చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది.
ఎమ్మెల్యే కొడుకు సంగీత్ ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా
కాకపోతే ఒకర్ని చీరాల, మరొకర్ని గుంటూరు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి వైద్యం అందిస్తున్నారు. మృతులు ఎక్కడివారు? ఎక్కడికి వెళ్తున్నారు? బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ కొడుకు సంగీత్ ఫంక్షన్‌కు వెళ్లారు. వారంతా నరేంద్రవర్మకు దగ్గర బంధువులుగా చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ALSO READ: ఒకటో తరగతి విద్యార్థిపై ముగ్గురు టీచర్ల దాష్టీకం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన కారణంగా ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు పోలీసులు. మృతులంతా ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులుగా తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే సదరు ఎమ్మెల్యే ఇంట విషాదం నెలకొంది. దీనికి గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు మృతి..
బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్ కార్యక్రమానికి హాజరై తిరుగు వెళ్తుండగా ప్రమాదం
లారీ, కారు ఢీకొనడంతో నలుగురు మృతి
మృతులు కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు, లక్ష్మీ, పుష్పావతి,… pic.twitter.com/9Fao4oBjRN
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2025