Rajasthan Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలో టెంపో ట్రావెలర్, ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఫలోడిలోని మటోడా గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ పాస్వాన్ మాట్లాడుతూ.. “ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 18 మంది మరణించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం తరలించడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం” అని అన్నారు.
ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఫలోడిలోని మటోడా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం, హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరికీ సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులకు సూచనలు ఇచ్చాను. గాయపడిన వారికి త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్ లో పోస్టు చేశారు.
A horrific road accident in Rajasthan’s Jodhpur district claimed 18 lives when an uncontrolled tempo traveller collided head-on with a truck near Matoda village in Phalodi. All victims were residents of Mathania. pic.twitter.com/IPyjRBPZrQ
— Naveen Patel (@naveenptel) November 2, 2025