Mypadu Beach: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిను ముగ్గురు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. నెల్లూరు కోటమిట్టకు చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు హుమాయూన్, ఆదిల్, తజీమ్ మైపాడు బీచ్ లో స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో గజ ఈతగాళ్లు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో సముద్రం ఉద్ధృతంగా ఉందని, అందువల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై నాగార్జున రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించారు.
ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ముగ్గురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. కెరటాలను అంచనా వేయలేక సముద్రంలో గల్లంతయ్యారు. వీరు నెల్లూరులోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
Also Read: Madhya Pradesh: నిశ్చితార్థానికి ముందు.. వరుడి తల్లితో వధువు తండ్రి జంప్
విద్యార్థుల గల్లంతు విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. బీచ్‌లో గల్లంతై మరణించిన ముగ్గురు విద్యార్థుల వివరాలను పోలీసులు గుర్తించారు. పఠాన్ మహమ్మద్ తజీమ్ నారాయణరెడ్డిపేట గ్రామానికి చెందినవాడు. రెండో విద్యార్థి పఠాన్ హుమాయున్ ఇతడు నయాబ్ రసూల్ కుమారుడు, ఈ అబ్బాయి నెల్లూరు నగరంలోని కోటమిట్ట నివాసి అని పోలీసులు తెలిపారు. మూడో విద్యార్థి ఆదిల్ కోటమిట్ట నివాసి. ఈ ముగ్గురూ కలిసి ఆదివారం సరదాగా ఈత కోసం మైపాడు బీచ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.