E-Paper
Advertisement

Bhupalpally Robbery: భూపాలపల్లిలో దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ!

Bhupalpally Robbery: భూపాలపల్లిలో దొంగల బీభత్సం.. తాళం వేసిన ఇంట్లో భారీ దోపిడీ!
Advertisement

Bhupalpally Robbery: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీలో ఈ స్థాయిలో దొంగతనం జరగడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశం

Advertisement

బాధితులు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పక్కా పథకం ప్రకారం ఇంటిపై నిఘా ఉంచిన దుండగులు, ఎవరూ లేని సమయం చూసి ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలను చిందరవందర చేసి అందులో ఉన్న విలువైన సొత్తును అపహరించారు.

బాధితులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం విరగ్గొట్టి ఉండటంతో షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రూ. 1 లక్ష నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

Advertisement

పోలీసుల దర్యాప్తు

బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కాలనీలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల కదలికల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలో గస్తీ పెంచాలని, అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Also Read:  రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×