E-Paper
Advertisement

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!
Advertisement

Train Passengers Alert: చండీగఢ్ రైల్వే స్టేషన్‌ లో ఆధునీకరణ పనుల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 15 వరకు మొత్తం 36 రోజుల పాటు రైల్వే స్టేషన్‌ లో విద్యుత్, ట్రాఫిక్ బ్లాక్‌లు అమలు చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల సర్వీసులు పూర్తిగా రద్దు కావడం, కొన్ని పాక్షికంగా రద్దు కావడం, మరికొన్నింటి ప్లాట్‌ ఫామ్‌లు మారడం లాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి.

442 రైలు ట్రిప్పులపై ప్రభావం

రైల్వే చేపడుతున్న ఈ పనుల కారణంగా మొత్తం 442 రైలు ట్రిప్పులపై ఎఫెక్ట్ పడనుంది. చండీగఢ్‌కు రావాల్సిన కొన్ని రైళ్లు అంబాలా వరకే నడవనున్నాయి. మరికొన్ని సర్వీసులు అంబాలా నుంచే ప్రారంభమయ్యేలా మార్పులు చేశారు. దీంతో చండీగఢ్‌కు వెళ్లే లేదంటే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ రవాణాను ఎంచుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా చండీగఢ్-అంబాలా మధ్య ప్రయాణించే వారికి ఎక్కువ సమయం, అదనపు ఖర్చు తప్పేలా లేదు.

మూడు దశల్లో పనులు

Advertisement

స్టేషన్ ఆధునీకరణలో భాగంగా పైకప్పు మీదుగా బ్యాలెన్స్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడంతో పాటు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి గర్డర్లను తొలగించే పనులు చేపట్టనున్నారు. ఈ పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని రైల్వే నిర్ణయించింది. మొదటి దశ సెప్టెంబర్ 10 నుంచి 21 వరకు, రెండో దశ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 వరకు, చివరి దశ అక్టోబర్ 4 నుంచి 15 వరకు కొనసాగుతుంది.

శతాబ్ది రైళ్ల ప్లాట్‌ ఫామ్‌లు మార్పు

చివరి దశలో ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులు మరింత జాగ్రత్తగా ఉండాలి. న్యూఢిల్లీ-కల్కా శతాబ్ది ఎక్స్‌ ప్రెస్   సాధారణంగా చండీగఢ్‌ లోని ప్లాట్‌ఫామ్ 1పై ఆగుతుంది. కానీ, అక్టోబర్ 4 నుంచి 15 వరకు ఈ రైలును ప్లాట్‌ఫామ్ 5కి మార్చనున్నారు. అదేవిధంగా కల్కా-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ ప్రెస్ ప్లాట్‌ఫామ్ 1కు బదులుగా ప్లాట్‌ఫామ్ 3 నుంచి నడవనుంది. ఇతర శతాబ్ది సర్వీసుల ప్లాట్‌ఫామ్‌లలో కూడా మార్పులు ఉంటాయి.

అంబాలా నుంచి రాకపోకలు   

Advertisement

కొన్ని రైళ్లను నిర్దిష్ట తేదీల్లో చండీగఢ్‌కు బదులుగా అంబాలాలోనే ముగించనున్నారు. రామ్‌నగర్-చండీగఢ్ సర్వీస్, అజ్మీర్-చండీగఢ్ గరీబ్ రథ్, ఉదయ్‌పూర్-చండీగఢ్ సర్వీస్ లాంటి రైళ్లపైనా ఈ ఎఫెక్ట్ పడనుంది. అలాగే కొన్ని రైళ్ల ప్లాట్‌ఫామ్‌లు, బెర్తింగ్‌లోనూ మార్పులు ఉంటాయి. అక్టోబర్ 4 నుంచి 15 మధ్య ఏకంగా 39 రైళ్ల ప్లాట్‌ఫామ్‌లను మార్చే అవకాశం ఉంది. వందే భారత్, సుదూర రైళ్లు కూడా ఈ మార్పుల్లో ఉన్నాయి. ప్రయాణికుల ఇబ్బందులను కొంత తగ్గించేందుకు ఎంపిక చేసిన రైళ్లకు సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ (మొహాలీ)లో తాత్కాలిక హాల్ట్‌ లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

Read Also: దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

Tags

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×