BigTV English

Hyderabad:రీల్స్ చేస్తూ..రియల్ గానే పోయాడు..అంబర్ పేటలో విషాదం

Hyderabad:రీల్స్ చేస్తూ..రియల్ గానే పోయాడు..అంబర్ పేటలో విషాదం

doing the Bike stunt reels..one person spot died
సోషల్ మీడియాలో రీల్స్ చేయడం ఫ్యాషన్ గా మారింది. కొందరు అతి జుగుప్సాకరమైన రీల్స్ చే్స్తారు. మరికొందరు కామెడీ రీల్స్ చేస్తారు. అయితే కొందరు మాత్రం అత్యుత్సాహంతో ప్రాణాలకు తెగించి రీల్స్ చేస్తుంటారు.ఈ తరహా రీల్స్ కు కామెంట్స్, లైక్స్ వస్తుంటాయి. అంతే అంతకు మించిన ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే ఒక్కోసారి శృతి మించి చేసే సాహసాలు వాళ్ల రియల్ లైఫ్ కే ప్రమాదకరంగా తయారవుతున్నాయి.


అత్యుత్సాహంతో బైక్ స్టంట్స్

తాజాగా ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో బైక్ స్టంట్స్ చేస్తున్నారు. అది కూడా పబ్లిక్ వాహనాలు తిరిగే రహదారిపై వీరి విన్యాసాలు చూసి కొందరు చప్పట్లు కొట్టి ప్రోత్సహించగా మరికొందరు మాత్రం వీళ్లను బాహాటంగానే తిట్టిపోస్తున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పీఎస్ పరిధిలో శనివారం జరిగింది. మామూలుగానే రామోజీ ఫిలిం సిటీ పెద్ద అంబర్ పేట వద్ద జాతీయ రహదారిపై అత్యం వేగంగా వాహనాలు వచ్చిపోతుంటాయి. ఆ ఇద్దరు యువకులు సినీ ఫక్కీలో నడిరోడ్డు మీద వాహనాలు వెళుతుండగా బైక్ స్టంట్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ముందు వెనకా ఆలోచించకుండా రంగంలోకి దిగారు. పైగా ఓ పక్కన వర్షం. అది కూడా స్పెషల్ ఎఫెక్ట్ గా భావించి ఉంటారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరు బైక్ డ్రైవ్ చేస్తుండగా మరొకరు విన్యాసాలు చేసేలా మాట్లాడుకున్నారు. అంతకు ముందు గల్లీలో ఈ తరహా ఫీట్లు చేయడంతో వారికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.


జాతీయ రహదారిపై విన్యాసాలు

జాతీయ రహదారిపై చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో విన్యాసాలు మొదలు పెట్టారు జోరున వర్షం కావడంతో స్పీడ్ గా బైక్ నడుపుతున్న వ్యక్తి బ్యాలెన్స్ తప్పాడు. టైర్లు స్కిడ్ అవడంతో వెనక విన్యాసాలు చేస్తున్న శివ అనే వ్యక్తి కిందపడి తల పగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడిపిన వ్యక్తి కూడా తీవ్రగామాలకు గురయ్యాడు. అయితే స్థానికులు అప్రమత్తమై దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేర్చారు. బైక్ స్టంట్ విన్యాసంలో రీల్స్ చేద్దామని తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని కన్నీరుమున్నీరవుతున్నాడు అతని స్నేహితుడు. ఈ సంఘటనతో అయినా యువకులు ఇలాంటి అపాయకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. పనికిమాలిన రీల్స్ కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్న ఇలాంటి యువకులపై జాలి పడాలో, కోపగించుకోవాలో తెలియడం లేదని స్థానికులు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Delhi News: దారుణం.. సొంత తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతక కొడుకు.. చివరకు..?

Medak District Crime: కన్న కొడుకును చంపిన తల్లి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Khazana Jewellers Robbery: ఖజానా జ్యువెలరీ దోపిడీ దొంగలు ఇలా దొరికారు.. కీలక విషయాలు చెప్పిన డీసీపీ

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Medak crime: ప్రియుడి కోసం కొడుకుపై కత్తి.. మెదక్‌లో తల్లి ఘాతుకం!

Big Stories

×