Fake Priest: పూజల పేర రూ. లక్షల్లో మోసాలకు పాల్పడ్డ ఎన్నారై పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లి ప్రాంతానికి చెందిన రామ లచ్చారావు పూజారిగా చేస్తున్నారు. తన ద్వారా పూజలు జరిపించుకుంటే తలరాత మారిపోతుందని.. సంపన్నులైపోతారంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎవరీ జీవితం మారకపోవడంతో బాధితులు తమ డబ్బు వాపస్ చేయమని అడుగగా చేతబడి చేసి మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దాంతో బాధితుల్లో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు అతనిపై లుక్ ఔట్ నోటీస్ జారీ చేశారు. కాగా, ఇక్కడ కేసులు నమోదు కాగానే రామ లచ్చారావు అమెరికా పారిపోయాడు. అక్కడికి వెళ్లిన తరువాత కూడా తన బుద్దిని మార్చుకోలేదు. అమెరికాలో ఉంటున్న కొంతమంది తెలుగువారిని సైతం ఇలాగే మోసం చేశాడు. అమెరికాలోని ఓ గుడి నిర్వాహకులు కేసులు పెట్టటంతో పారిపోయి ఇండియాకు వచ్చాడు. లుక్ ఔట్ నోటీస్ జారీ అయి ఉన్న నేపథ్యంలో అతను శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.
Also Read: కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్‌లోకి..!