Visakha: విశాఖ సిటీలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న లారీని బలంగా ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు, ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ ఎయిర్‌పోర్టు సమీపంలోని శ్రీనగర్ ప్రాంతం వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురంలోని రామభద్రపురం వెళ్తోంది.
ఈ ఘటనలో దాదాపు 10 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగ్రాతులను సమీపంలోని అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలోని మృతి చెందినవారు.. ఇద్దరు మహిళలు, డ్రైవర్ ఉన్నారు.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలను క్రేన్ల ద్వారా పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు
AP: విశాఖలోని గాజువాకలో ఈ తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్, ఇద్దరు మహిళలు మరణించారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ప్రమాదం… pic.twitter.com/VuoTTUBt7s
— ChotaNews App (@ChotaNewsApp) May 31, 2026