E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 42 మంది మృతి.. మృతుల్లో హైదరాబాద్ వాసులు

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 42 మంది మృతి.. మృతుల్లో హైదరాబాద్ వాసులు
Advertisement

Road Accident: రోజురోజుకు పెరుగుతున్న బస్సు ప్రమాదాలు.. ఒకటి వింటే చాలు రోజు అవే వినాల్సి వస్తుంది. ఈ మధ్య బస్సు ప్రమాదాల వల్ల వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బస్సు ఎక్కితే మళ్లీ దిగుతామో లేదో అనే పరిస్థితి నెలకొంది. మోన్న చేవెళ్ల బస్సు ప్రమాదం ముగియకముందే నేడు మరో బస్సు ప్రమాదం జరిగింది. ఎక్కడంటే.. ?

డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొని 42 మంది మృతి
సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. అయితే ఉమ్రా యాత్రికులు మక్కా మసీద్ అల్‌హరామ్‌లో ప్రార్థనలు, తౌవాఫ్ వంటి కార్యక్రమాలు పూర్తి చేసి, మదీనాలోని మసిద్ అన్-నబవీని సందర్శించేందుకు ప్రయాణిస్తున్నారు. ఈ మార్గం భారతీయ యాత్రికులకు సాధారణంగా ఉపయోగించే రహదారి. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా డిజిటల్ ట్యాంకర్‌ను ఢికోట్టడంతో స్పాట్‌లో 42 మంది మృతి చెందారు.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే సౌదీ అధికారులు .. రక్షణ బృందాలను ఘటనా స్థలానికి పంపారు. ఎమర్జెన్సీ సర్వీసులు కొందరు బాధితులను రక్షించగా..మృత దేహాలను సేకరించారు. గాయపడినవారిలో కొందరు తీవ్ర పరిస్థితిలో ఉన్నారని, వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చారని అధికారులు తెలిపారు. అయితే వీరిలో 20 మంది మహిళలు ఉండగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువగా వీరిలో హైదరాబాద్‌ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

సౌదీ ప్రమాదంపై అక్కడి భారత దౌత్య వ్యవస్థ వెంటనే స్పందిచింది. హజ్ కమిటీ , భారతీయ ఏంబసీ.. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. మృత దేహాలను భారత దేశానికి తీసుకురావడానికి, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించడానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Also Read: సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. పెట్టుబడులు ఎన్ని వేల కోట్లంటే..!

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×