Road Accident: నల్గొండ, దేవరకొండ ప్రధాన రహదారపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి మండలం దేవత్‌పల్లి గేట్ సమీపంలో అతి వేగంగా వచ్చిన ఓ లారీ, ప్రయాణికలతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. లారీ వేగం ఎంతలా ఉందంటే ఆటోలోని వారు తేరుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో ఆటోలో మెుత్తం 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు కాకుండా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.
స్థానికుల అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారంణంగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో దేవత్‌పల్లి గ్రామ పరిసరాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read: క్యాబేజీ లోడ్‌లో కోట్లాది రూపాయల గంజాయి.. ఎలా దొరికిపోయారో చూడండి!
ఆటోను ఢీకొట్టిన లారీ.. నలుగురు మృతి
నల్గొండ-దేవరకొండ వద్ద ఘోర ప్రమాదం
నాంపల్లి మండలం దేవత్‌పల్లి గేట్ వద్ద ఘటన
ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలింపు
Lorry hits auto, four dead.. Massive accident at… pic.twitter.com/Ipa7KcqJ7Z
— BIG TV Breaking News (@bigtvtelugu) March 15, 2026