E-Paper
Advertisement

Harish Rao: ‘కాంగ్రెస్ సర్కార్‌కు.. అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?’.. హరీశ్ రావు ఫైర్

Harish Rao: ‘కాంగ్రెస్ సర్కార్‌కు.. అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?’.. హరీశ్ రావు ఫైర్
Advertisement

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వారి పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్ రావును కలిశారు. తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

‘రెండేళ్లైనా హామీల ఊసే లేదు’

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్లకు రూ. 18,000 కనీస వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పిందన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. వారి కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు దేశంలోనే అత్యధికంగా వేతనాలు పెంచామని గుర్తుచేశారు.

’10 సమస్యలు పరిష్కరించాలి’

Advertisement

అంగన్‌వాడీలు ప్రధానంగా ఎదుర్కొంటున్న పది సమస్యలను వెంటనే పరిష్కరించాలని హరీశ్ రావు గారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ టీచర్లను ప్రీ-ప్రైమరీ టీచర్లుగా గుర్తించి ప్రీ ప్రైమరీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రీ-ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయడం వల్ల దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న అంగన్‌వాడీ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో పెడుతున్న ప్రీ-ప్రైమరీకి, అంగన్‌వాడీలకు తేడా ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

‘ఒంటిపూట మాత్రమే నడపాలి’

అదే విధంగా టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ ఇచ్చిన ప్రభుత్వ జీవో అసలు అమలులో ఉందా లేదా అని హరీశ్ రావు గారు ప్రశ్నించారు. ఉంటే ఇప్పటివరకు ఎంతమందికి ఆ బెనిఫిట్స్ అందజేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హెల్పర్ స్థాయి నుండి ప్రమోషన్ పొందిన వారికి టీచర్ పూర్తి జీతం ఇవ్వాలని ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నెల 15వ తేదీ నుంచే అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట మాత్రమే నడపాలని, టేక్ హోమ్ రేషన్ విధానాన్ని అమలు చేస్తూ వేసవి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Induction Stove Offers: అయ్యబాబోయ్.. బ్రాండెడ్ ఇండక్షన్ స్టవ్స్‌పై.. ఎగిరిగంతేసే ఆఫర్లు!

‘అసెంబ్లీలో నిలదీస్తాం’

మరోవైపు ఆన్‌లైన్ రిపోర్టింగ్ కోసం అంగన్‌వాడీలకు వెంటనే కొత్త మొబైల్స్ ఇవ్వాలని యాప్‌లలో ఉన్న సాంకేతిక సమస్యలను NHTS, పోషణ్ ట్రాకర్ పరిష్కరించి ఒకే యాప్‌గా తీసుకురావాలని సూచించారు. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్య లక్ష్మి పథకం బిల్లుల బడ్జెట్ పెంచాలని అంగన్‌వాడీలకు బీఎల్ఓ లాంటి ఇతర శాఖల పనుల భారం మోపవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్ రావు పేర్కొన్నారు.

Also Read: Air Cooler: కూలర్‌ను నీరు లేకుండా వాడొచ్చా? ఒకవేళ వాడితే ఏం జరుగుతుంది?

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×