Father Killed Son: కుమారుడి వేధింపులు భరించలేక కన్నతండ్రే బిడ్డను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఉదంతం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వెలుగు చూసింది. కన్న కొడుకు సోమశేఖర్ రెడ్డిని తండ్రి గంగుల రెడ్డి మర్డర్ చేయించాడు. పదేళ్ల క్రితం సోమశేఖర్రెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య, ఐదేళ్ల కుమారుడు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో సోమశే ఖర్రెడ్డితో పాటు తండ్రి గంగులరెడ్డి కూడా జైలు శిక్ష అను భవించారు. జైలు నుంచి బయటకు వచ్చాక సోమశేఖర్రెడ్డి ఊర్లో అందరితో గొడవలకు దిగేవాడు. ఇతడి ప్రవర్తన భరించలేక సోదరుడు జ్ఞానేంద్రరెడ్డి తన భార్యాపిల్లలతో దూరంగా వెళ్లిపోయాడు.
తల్లిదండ్రులతో ఉంటోన్న సోమశే ఖర్రెడ్డి.. వారిని కూడా కొట్టి డబ్బులు లాక్కోవడం చేసే వాడు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి, ఎవరూ. అమ్మాయిని ఇవ్వకపోవడంతో ఆ కోపాన్ని అమ్మానాన్నల మీద చూపేవాడు. ఇలా సోమశేఖర్రెడ్డి ప్రవర్తన మితిమీరి పోవడంతో తండ్రి గంగులరెడ్డి అతన్ని చంపేయాలని నిర్ణ యించుకున్నాడు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 15 రోజుల క్రితం సోమశేఖర్రెడ్డిని పథకం ప్రకారం కృష్ణాపురం సమీపంలోని బోయకొండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అతని చేత మద్యం తాగించి హత్య చేశారు.
Also Read: అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్రగాయాలు
రెండు రోజుల క్రితం నిందితుడు ఈ విషయాన్ని మద్యం మత్తులో బయటకు చెప్ప డంతో పోలీసులకు తెలిసింది. ఈలోగా పశువుల కాపరులు అడవిలో దుర్వాసన వస్తుండడంతో గమనించగా, గుర్తుపట్ట లేని విధంగా మృతదేహం కన్పించింది. మృతదేహం పాడైపోవడంతో తరలించడానికి వీలుకాలేదు. దీంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. పుంగనూరు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిందితులు గంగులరెడ్డి, అమర్, రమేశ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.