Gun Fire: అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై నాటు తుపాకీతో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో హనుమంతు అనే వ్యక్తి మృతి చెందగా.. రమణ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. వ్యాపారులే లక్ష్యంగా పెట్టుకుని కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అక్కడున్న జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలంలో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాత సామాగ్రి అమ్ముకుంటున్న ఇద్దరు వ్యాపారులపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: శోభనం రాత్రి గంజాయి, మటన్ కావాలన్న పెళ్లికూతురు.. ఆమె ఆడది కాదన్న అనుమానంతో వరుడు!
దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి కోసం సీసీ పుటేజ్‌లు పరిశీలిస్తున్నారు పోలీసులు. అసలు దుండగులు ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు. గతంలో కాల్పులు జరిపిన ఇద్దరికి గొడవలు ఏమైనా ఉన్నాయా.. లేక తెలిసిన వాళ్లే చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే కాల్పులు జరగడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనలో దీంతో హనుమంతు(50) మృతి చెందగా.. రమణ(30) అనే తీవ్రంగా గాయపడ్డాడు. ఇతనికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స్ పొందుచతున్నాడు.
అయితే రాయచోటి కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. మాధవరం మండలంలోని మద్దెల చెరువు శివార్లలో నాటు తుపాకీ తో ఇద్దరిపై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. అయితే మద్దెల చెరువు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కాల్పులు చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జంతువులను వేటాడే క్రమంలో ఇద్దరిపై కాల్పులు చేసినట్టు గుర్తించారు. వేటగాళ్లు ఎవరో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు.