E-Paper
Advertisement

Chittoor district : బంధువులు ఇంట్లో ఉండగానే.. పెళ్లయిన నాలుగు రోజులకే వరుడు సూసైడ్, ఏం జరిగింది?

Chittoor district : బంధువులు ఇంట్లో ఉండగానే.. పెళ్లయిన నాలుగు రోజులకే వరుడు సూసైడ్, ఏం జరిగింది?
Advertisement

Chittoor district : దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంట్లోనే ఉన్నారు. రేపో మాపో ఇంటికి వెళ్లాల్సిన భావిస్తున్న సమయంలో షాకిచ్చే ఘటన జరిగింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే వరుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. దీంతో పెళ్లింట బంధువులు షాకయ్యారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లాలో ఊహించని ఘటన

Advertisement

చిత్తూరు జిల్లాలో దారుణమైన ఘటన బయటపడింది. ఇంటి ముంగిట వేసిన పందిరి అలాగే ఉంది. పెళ్లికి వచ్చిన బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కోలాహలంగా ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. నాలుగురోజుల కిందట వివాహం చేసుకున్న వరుడు, చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

బైరెడ్డిపల్లె మండలం జోగిండ్ల గ్రామానికి చెందిన నరసింహులు కొడుకు మురళి. స్థానికంగా ఉండే సీఎస్‌సీ కేంద్రంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట దగ్గర బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత విడాకులు సైతం తీసుకున్నారు.

Advertisement

పెళ్లయిన నాలుగు రోజులకే వరుడు సూసైడ్, ఏం జరిగింది?

సీన్ కట్ చేస్తే.. ఫిబ్రవరి 25న ఇచ్చాపురానికి చెందిన సుజాతతో వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగురోజు కావడంతో శనివారం సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన మురళి మధ్యాహ్నం, సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వరుసటి రోజు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బైరెడ్డిపల్లె మండలంలో పెద్దచెరువు చెప్పులు ఉండటంతో గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. చివరకు మురళి మృతదేహాన్ని ఒడ్డుకు తీశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అసలేం జరిగింది? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు.

ALSO READ: నెల్లూరు GGHలో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన రోగులు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×