E-Paper
Advertisement

RTC Bus Accident: గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా, 20 మందికి పైగా గాయాలు

RTC Bus Accident: గద్వాల జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా, 20 మందికి పైగా గాయాలు
Advertisement

RTC Bus Accident: హైదరాబాద్ నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. కాళ్లు, చేతులు ఇతర అవయవాలకు దెబ్బలు తగలడంతో ప్రమాద దృశ్యాలు కలచి వేశాయి. తెల్లవారుజామున జరిగిన ఘటనతో క్షతగాత్రుల అహంకారాలతో ప్రాంతమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో స్నేహలత, వీరేష్, శివ, రంగన్న,సుబ్బరాయుడు, మోహన్, అరుణ, రామేశ్వరమ్మ, గౌస్ కు గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురి కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే జాతీయ రహదారి భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు క్షతగాత్రులను రక్షించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురికావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్యంగా నిద్రమత్తులో ఉండడం, ఆ జాగ్రత్త, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తరచుగా ప్రైవేట్ బస్సులు బోల్తా పడుతుండగా ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×