E-Paper
Advertisement

Gang Rape in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం..సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై స్నేహితుల గ్యాంగ్ రేప్!

Gang Rape in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం..సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై స్నేహితుల గ్యాంగ్ రేప్!
Advertisement

Hyderabad Software Employee Gang Rape:హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ హోటల్‌లో ఓ యువతిపై ఆమె స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు. పార్టీ చేసుకుందామని చెప్పి ఓ హోటల్‌కు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న యువతిని ఆమె స్నేహితులు ఆహ్వానించారు. ఇది నమ్మిన ఆ యువతి వారితో వెళ్లింది. అయితే మొదట ఆమెను హోటల్ రూం తీసుకెళ్లారు. ఆమె స్నేహితులతో పాటు మరో వ్యక్తి కూడా ఉండడంతో పార్టీ అనుకొని ఆ యువతి అలానే వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత అందరూ కలిసి మద్యం తాగారు.

అయితే, మద్యం మత్తులో ఆమెపై స్నేహితులు గ్యాంగ్ రేప్ చేశారు. ఇందులో వారితో పాటు వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేసినట్లు యువతి వనస్థలిపురంలోని పీఎస్ పరిధిలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువతితోపాటు ఆమె స్నేహితులు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓంకార్ నగర్ లోని బొమ్మరిల్లు హోటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై అత్యాచారం చేసినట్లు చెప్పారు. నిందితుడు హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డిగా గుర్తించారు. అయితే ఆ యువతికి గౌతమ్ రెడ్డి చిన్ననాటి మిత్రుడు కావడంతో సోమవారం రాత్రి రెస్టారెంట్ కు వెళ్లారు. మద్యం తాగిన తర్వాత ఇద్దరు హోటల్ రూం వెళ్లారు. తర్వాత చూసేసరికి గౌతమ్ తోపాటు మరోవ్యక్తి ఉన్నాడు. ఆ యువతి రక్తపు మడుగులో పడి ఉంది.

Also Read: డ్రగ్స్ కేసులో వామ్మో..ఇంత మంది సెలబ్రిటీలా?

Advertisement

వెంటనే ఐడీ ప్రూఫ్ ఆధారంగా యువతి కుటుంబ సభ్యులకు హోటల్ నిర్వాహకులు సమాచారం అందించారు. ప్రస్తుతం గౌతమ్ రెడ్డి, అతని స్నేహితుడు పరారీలో ఉన్నారు. గౌతమ్ తోపాటు మరొకరు మద్యం మత్తులో అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×