E-Paper
Advertisement

Double Murder: భార్య ప్రియుడిని భోజనానికి పిలిచిన భర్త.. ఒక గంట తర్వాత ఇంట్లో రక్తపాతం, అసలు ఏమైంది?

Double Murder: భార్య ప్రియుడిని భోజనానికి పిలిచిన భర్త.. ఒక గంట తర్వాత ఇంట్లో రక్తపాతం, అసలు ఏమైంది?
Advertisement

Double Murder: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఈ విషయం తెలిసి పగతో రగిలిపోతున్నారు. ఫలితంగా ఒకరినొకరు చంపుకునే ఘటనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన యూపీలో వెలుగుచూసింది. విందుకు ఫ్రెండ్‌ని పిలిచి అక్కడే అతడ్ని, భార్యని కాల్చి చంపాడు ఓ వ్యక్తి. అసలేం జరిగింది?

ఘజియాబాద్‌లో డబుల్ మర్డర్ వ్యవహారం తీవ్ర కలకలం

Advertisement

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సిటీలో ట్రోనికా సిటీ రామ్‌పార్క్ కాలనీలో ఉంటున్నారు ఓ జంట. రషీదు వయస్సు 38 ఏళ్లు కాగా, షబ్నమ్ వయస్సు 36 ఏళ్లు. వీరిద్దరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అరజడను మంది పిల్లలు ఉన్నారు. రషీద్ ఫర్నిచర్ వ్యాపారి కావడంతో అతడి వద్ద పనిచేసేవాడు ఫహీమ్. తర్వాత కాలంలో రషీద్‌కు స్నేహితుడిగా మారిపోయాడు.

రెండేళ్లుగా భార్య షబ్నమ్-ఫహీమ్ మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. చాన్నాళ్లుగా ఈ విషయం మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఆరు నెలల కిందట ఓ వివాహ వేడుక సందర్భంగా ఈ విషయం రషీద్‌కు తెలిసింది. ఆనాటి నుంచి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇలాంటివి ఆపేయాలని, పిల్లలు ఉన్నారని భార్యని పలుమార్లు హెచ్చరించాడు రషీద్.

Advertisement

భోజనం పెట్టి.. భార్య, ఆమె ప్రియుడ్ని చంపిన భర్త

ఆమె ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ యవ్వారానికి పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు రషీద్. అందుకోసం ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. సోమవారం రాత్రి స్నేహితుడు ఫహీమ్‌ని భోజనానికి ఇంటికి పిలిచారు. రషీద్, అతడి భార్య, ఆమె ప్రియుడు ఫహీమ్ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వరకు సాగింది.

పట్టరాని కోపంతో గదిలో నుంచి తీసుకొచ్చిన తుపాకీతో మొదట ఫహీమ్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత భార్య షబ్నమ్‌పై గురిపెట్టాడు. తలలకు బుల్లెట్‌లు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే కుప్పకూలారు. రషీదు చేసిన జంట హత్యలను తన ఏడేళ్ల కుమారుడు దగ్గరుండి చూసి షాకయ్యాడు. ఆ తర్వాత రషీద్ తన కొడుకు వైపు చూసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ALSO READ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. క్యూనెట్ మోసాలు బట్టబయలు.. పూసగుచ్చినట్లు చెప్పిన సజ్జనార్!

గన్ శబ్దాలు విని ఇరుగు పొరుగు రషీదు ఇంటికి వచ్చారు. రషీద్ భార్య, ఆమె ప్రియుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిద్దరు మృతి చెందారు. ఫహీమ్ తండ్రి ఫిర్యాదు మేరకు రషీద్‌పై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. రషీద్‌తోపాటు ఫహీమ్‌పై నేర చరిత్ర ఉంది. తన పేరు మీద పరారీలో ఉన్న రషీద్ కోసం పోలీసులు గాలిస్తున్నాయి.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×