E-Paper
Advertisement

QNet Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. క్యూనెట్ మోసాలు బట్టబయలు.. పూసగుచ్చినట్లు చెప్పిన సజ్జనార్!

QNet Scam: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్..  క్యూనెట్ మోసాలు బట్టబయలు.. పూసగుచ్చినట్లు చెప్పిన సజ్జనార్!
Advertisement

QNet Scam: దేశవ్యాప్తంగా మోసాలకు తెగబడుతున్న హైదరాబాద్ కు చెందిన క్యూ నెట్ (Q NET)పై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. 32 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట 1998 నుంచి క్యూనెట్ సంస్థ వివిధ రకాల పేర్లతో ఘరానా మోసాలకు పాల్పడుతూ వస్తోందని పేర్కొన్నారు.

Advertisement

ప్రొడక్ట్ ను ముందు పెట్టి.. వెనకాల మోసం చేసి డబ్బులు దండుకోవడం క్యూనెట్ సంస్థకు పరిపాటిగా మారిపోయిందని సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ నగరంలో 22 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్యూనెట్ సంస్థపై కేసులు నమోదు చేశామని.. మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యాన్ యాక్ట్ 1978 ప్రకారం చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. ఏకంగా 30 టీమ్ లను ఏర్పాటు చేసి.. ఈ కేసును ఛేదించినట్లు సజ్జనార్ స్పష్టం చేశారు.

సిద్దిపేటకు చెందిన బాధితుడు హరికృష్ణ బాధితుడు.. క్యూనెట్ సంస్థ కారణంగా రూ.5 లక్షలు మోసపోయారని సజ్జనార్ తెలిపారు. హరికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా Q NET సంస్థపై దృష్టిసారించామన్నారు. వెల్నెస్ ప్రొడక్ట్స్, బిస్కెట్స్, హెల్త్ ఫుడ్స్ తయారీ పేరిట ప్రజల్లోకి వెళ్తూ వారిని ఉచ్చులోకి కంపెనీ నిర్వాహకులు దింపారని తెలిపారు.

Advertisement

Also Read: Data Expiry Issue: అర్ధరాత్రి దాటితే.. మెుబైల్ డేటా మాయం.. రాజ్యసభలో గర్జించిన ఎంపీ

క్యూనెట్ సంస్థలో చేరే వ్యక్తులతో.. తాము ఇష్టపూర్వకంగా చేరుతున్నామని బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నారని సజ్జనార్ తెలిపారు. ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ.. వాళ్లకు వెల్ నెస్ ప్రొడక్ట్ చూపెట్టి సైడ్ ఇన్ కమ్ పేరుతో ట్రాప్ చేశారని అన్నారు. పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే వాల్లే ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించి మరి డబ్బులు వసూలు చేశారన్నారు. నెల రోజుల పాటు క్యూనెట్ సంస్థపై దర్యాప్తు చేసి.. ఆధారాలు సేకరించి.. చివరిగా నిందితులను అరెస్టు చేసినట్లు సజ్జనార్ వివరించారు.

Also Read: Free OTT Subscriptions: ఒక్క రీఛార్జ్‌తో.. Netflix, Hotstar, Prime ఫ్రీ.. ఓటీటీ ప్రియులూ ఇక రెచ్చిపోండి!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×