E-Paper
Advertisement

Accidental Death: రీల్స్ చేయాలనుకుని చెట్టుకు ఉరేసుకున్నట్లు నటించబోయాడు.. చివరకు..

Accidental Death: రీల్స్ చేయాలనుకుని చెట్టుకు ఉరేసుకున్నట్లు నటించబోయాడు.. చివరకు..
Advertisement

Accidental Death: యువత చేసే పనులు కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నా మరి కొన్ని సార్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నాలజీ విపరీతంగా వ్యాపిస్తున్న ఈ తరుణంలో సోషల్ మీడియాపై దృష్టి మరింత పెరిగిపోతుంది. ఎప్పుడు చూసినా సోషల్ మీడియా అంటూ యువత చేస్తున్న పనుల్లో కొంత మంది ఫేమస్ అవుతూనే ఉన్నా మరికొంత మంది ఏదో చేయాలనే తపనతో చేసే చిన్నచిన్న పొరపాట్లు ప్రాణాలను బలిగొంటున్నాయి. తాజాగా రీల్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.

రీల్స్ చేసేందుకు ప్రయత్నించిన వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువకుడి ప్రాణాలను సైతం కోల్పోయాడు. చనిపోయినట్లు నటిస్తూ రీల్స్ చేయాలని చూసి నిజంగానే శవంగా తేలాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సెల్ ఫోన్ లో రీల్స్ కోసం సెట్ చేసుకుని ఎదురుగా పెట్టుకున్నాడు. అనంతరం ఉరి వేసుకున్నట్లు నటించి వీడియోను తీసుకోవాలని ఆలోచించాడు. ఈ తరుణంలో దానికి సంబంధించి అంతా సెట్ చేసుకున్నాడు.

Advertisement

ఉరి వేసుకున్నట్లు నటించాలని అనుకున్న క్రమంలో ఒక్కసారిగా తాడు గట్టిగా గొంతుకు బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక అజయ్ అనే 23 ఏళ్ల యువకుడు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేటలోని తన చిన్నక్క ఇంట్లో జరిగిందీ ఘటన. అజయ్ మృతిపై అనుమానం ఉందంటూ పోలీసులకు మృతుడి తల్లి దేవమ్మ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×