Rain Tragedy: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో దీని ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది. జిల్లాలోని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో సుమారు అరగంట పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమై, జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
ఈ ప్రకృతి విపత్తు సత్యవరం గ్రామంలో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు పొలంలో తమలపాకులు సేకరిస్తుండగా.. ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి. ఆ వేగానికి పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు వారిపై విరిగిపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే తోటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హఠాత్తుగా వచ్చిన ఈ తుఫాను లాంటి వాతావరణం అన్నదాతలకు, సామాన్య ప్రజలకు భారీ నష్టాన్ని చేకూర్చింది.
గాలివాన బీభత్సం.. ఇద్దరు మృతి
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కురిసిన గాలివాన తీవ్ర అల్లకల్లోలం సృష్టించింది.
అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంట పాటు వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.… pic.twitter.com/86uoAhKO3G
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2026