E-Paper
Advertisement

Keesara Crime: హిజ్రాల అరాచకం..! గృహ ప్రవేశానికి డబ్బులు ఇవ్వలేదని, ఇంటి ఓనర్‌పై దాడి

Keesara Crime: హిజ్రాల అరాచకం..! గృహ ప్రవేశానికి  డబ్బులు ఇవ్వలేదని, ఇంటి ఓనర్‌పై దాడి

Keesara Crime: హిజ్రాల పేరు చెబితేచాలు.. కొన్ని ప్రాంతాలవాసులు హడలి పోతున్నారు. ఏదైనా మంచి పని చేసినప్పుడు వారి ఆశీర్వాదం ఉంటే మంచి జరుగుతుందని కొందరు వ్యక్తులు బలంగా నమ్ముతారు. మనుషుల పిచ్చిని.. సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఒక్కోసారి దాడులకు సైతం పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరుగు తున్నాయి.  తాజాగా హైదరాబాద్ శివారులో అలాంటి ఘటన వెలుగుచూసింది.

హిజ్రాల అరాచకం

శుభకార్యాల సీజన్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ సిటీ పరిధిలో హిజ్రాలు ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. గృహ ప్రవేశం, పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షలు, షాపు ఓపెనింగ్ వంటి కార్యక్రమాలు జరిగితే చాలా క్షణాల్లో వాలిపోతుంటారు. నోటి ఇష్టం వచ్చినంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మావల్ల కాదని మొండి కేస్తే, హిజ్రాలు తమ గ్యాంగులను రప్పించి నానారభస చేస్తుంటారు. ఇటీవలకాలంలో వారి అరాచకాలు ఎక్కువయ్యాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల శివారు ప్రాంతాల్లో హిజ్రాలు వీరంగం సృష్టిస్తున్నారు. కీసర ప్రాంతంలో హిజ్రాలు బరి తెగించారు.. కంటిన్యూ చేస్తున్నారు కూడా. వారి అరాచకాలకు అంతులేకుండా పోతోంది. కొత్త ఇంట్లోకి దిగితే లక్ష ఇవ్వాల్సిందే. లేదంటే చాలు, వెంటనే ఫోన్ చేసి వారి సభ్యులను పిలిస్తారు. ఆ తర్వాత నానాయాగీ చేస్తుంటారు.  ఓ ఇంటి యజమానిపై ఏకంగా కర్రలతో దాడి చేసి గాయపడిచారు.

గృహ ప్రవేశానికి డబ్బులు ఇవ్వలేదని దాడి

చీర్యాల్ శ్రీబాలాజీ ఎన్‌క్లేవ్‌లో తన కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు సదానందం అనే వ్యక్తి. ఆదివారం ఇంటి ముందు పెండింగ్ ఉన్న పనులు చేస్తున్నాడు.  సదానందం ఇంటికి కొంతమంది హిజ్రాలు వచ్చారు. కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసినందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  తాను అంత ఇచ్చేకోలేనని అన్నాడు.  హిజ్రాలు అతడ్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కొద్దిసేపటికి మూడు ఆటోల్లో దాదాపు 20 మంది సదానందం ఇంటికి చేరుకున్నారు. వచ్చి రాగానే గేటు ధ్వంసం చేయడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశారు. కర్రలు, రాళ్లతో సదానందం కుటుంబసభ్యులపై దాడి చేశారు.  ఈ ఘటనలో ఇంటి యజమాని తీవ్రంగా గాయపడ్డారు.

ALSO READ:  ఢిల్లీ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ కలకలం.. ఎన్ఐఏ వేశంలో కిలాడీ లేడి

ఈ ఘర్షణ చూసి చుట్టు పక్కన ప్రజలు అక్కడికి చేరుకున్నారు.  వారిని చూసి భయపడిన హిజ్రాలు, అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు సదానందం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. కేవలం కీసరకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.

హైదరాబాద్ శివారులో హిజ్రాలు ఈ విధంగానే రెచ్చిపోతున్నారు.  శుభకార్యాలకు మంచి రోజులున్న సమయంలో తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో  ఓ వాహనం లేదా ఆటోలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో చక్కర్లు కొడతారు. ఎక్కడైనా సందడి నెలకుంటే చాలు..  ఆ ప్రాంతానికి వచ్చి వారి టీమ్ సభ్యులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వడం, ఆపై లొకేషన్ షేర్ చేయడం జరుగుతోంది.

స్థానిక హిజ్రాలు ఎంత ఇస్తే అంత తీసుకుంటారని, నార్త్ నుంచి కొంతమంది హిజ్రాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారని అంటున్నారు. వారే ఆ దందా సాగిస్తున్నారని అంటున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక హిజ్రాలు చెబుతున్నారు.

 

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×