E-Paper
Advertisement

Hindupur Rape Case: హిందూపురం.. అత్తాకోడళ్ల అత్యాచారం కేసు, నిందితులు మైనర్లు?

Hindupur Rape Case: హిందూపురం.. అత్తాకోడళ్ల అత్యాచారం కేసు, నిందితులు మైనర్లు?
Advertisement

Hindupur Rape Case: హిందూపురంలో అత్తా కోడలుపై గ్యాంగ్ రేప్ కేసు ఎంతవరకు వచ్చింది? ఈ దారుణం వెనుక ఎవరున్నారు? నిందితులు ముగ్గురు మైనర్లు ఉన్నారా? ఇంతకీ నిందితులు దొరికారా? లేక పోలీసుల గాలింపు కొనసాగుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

హిందూపురం అత్తాకోడలు అత్యాచారం ఘటనలో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ ఫ్యామిలీ గురించి తెలిసినవారే ఈ పని చేసినట్టు భావిస్తున్నారు. మొత్తం ఐదుగురు నిందితులుగా భావిస్తున్నారు పోలీసులు. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వారికి సంబంధించి కొంత సమాచారం పోలీసులకు తెలిసినట్టు సమాచారం.

Advertisement

హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలంలో ఉంటోంది ఓ ఫ్యామిలీ. బళ్లారికి చెందిన ఆ కుటుంబం ఉపాధి నిమిత్తం వలస వచ్చింది. బాధిత బంధువులు తండ్రి, ఆయన కొడుకు ఓ మిల్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.

అత్తా, కోడలు నిర్మాణ రంగంలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శనివారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో టూ వీలర్స్‌పై ఐదుగురు వ్యక్తులు ఈ ఫ్యామిలీ ఉన్న ప్రాంతానికి వచ్చారు. అడ్డు వచ్చిన తండ్రీ కొడుకులను కత్తులు చూపించి భయపెట్టారు.

Advertisement

ALSO READ: విజయవాడ రైల్వే స్టేషన్‌ లోకోపైలెట్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. బీహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

ఇంట్లో ఉన్న అత్త, కోడలిని కత్తులతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భాదితుల ఇంటికి వచ్చారు. ఏం జరిగిందన్న దానిపై బాధితుల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు నిర్థారించారు. ఈ ఫ్యామిలీని గమనించిన వాళ్లు ఈ దారుణానికి పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు టీమ్ లు రంగంలోకి దిగాయి. ఈ కేసును జిల్లా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×